Bigg Boss 6 Telugu 15th Week Voting: అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు చివరి దశకి చేరుకుంది..మరో వారం రోజుల్లో ఈ సీజన్ ముగియబోతుంది..పోయినవారం ఇనాయ సుల్తానా ఎలిమినేట్ అవ్వగా, ఇప్పుడు టాప్ 6 కంటెస్టెంట్స్ గా రేవంత్ , శ్రీహాన్ , ఆది రెడ్డి ,రోహిత్ , శ్రీ సత్య మరియు కీర్తి మిగిలారు..గత వారం లో జరిగిన ఇనాయ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ హిస్టరీ లోనే అతి పెద్ద మోసం అని..టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న ఇనాయ ఎలిమినేట్ అవ్వడం అనేది అసాధ్యమని.
బిగ్ బాస్ మరోసారి తన పక్షపాత బుద్దిని చూపించాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి..కానీ ఈ సీజన్ లో బిగ్ బాస్ టీం అసలు ప్రేక్షకుల మనోభావాలను ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు..తనకి ఇష్టమొచ్చిన కంటెస్టెంట్ ని ఉంచుతున్నాడు..మిగిలిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నాడు అంటూ బిగ్ బాస్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు ప్రేక్షకులు.
ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ఆదివారం రోజే తెలిపిన సంగతి తెలిసిందే..అంటే ఆదివారం అర్థ రాత్రి నుండి బుధవారం వరుకు వచ్చిన ఓట్లలో ఎవరికీ అయితే తక్కువ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు..ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే శ్రీ సత్య కి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి..లెక్క ప్రకారం అయితే ఆమె ఎలిమినేట్ అయిపోవాలి..కానీ అందరూ ఊహించినట్టు ఎలిమినేషన్ చేస్తే అతను బిగ్ బాస్ ఎందుకు అవుతాడు..అందుకే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆది రెడ్డి బయటకి వచ్చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.
ఎందుకంటే శ్రీ సత్య ని స్వయంగా బిగ్ బాస్ కావాలని సేఫ్ చేస్తున్నాడంటూ ఒక రూమర్ చాలా కాలం నుండి ప్రచారం అవుతుంది..అది పోయినవారం ఇనాయ ఎలిమినేషన్ అప్పుడే ప్రూవ్ అయ్యింది..ఇప్పుడు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆది రెడ్డి ఎలిమినేట్ అయితే ఇక ఫిక్స్ అయిపోవచ్చు ఈ సీజన్ పెద్ద బోగస్ అని..చూడాలి మరి ఏమి జరగబోతుందో!