https://oktelugu.com/

Polavaram : పోలవరం.. చేతులెత్తేసిన కేంద్రం.. పూర్తవ్వడం కష్టమే..

Polavaram : పోలవరం.. ఏపీ కలల వరం.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యితే ఏపీలోని సగం జిల్లాల తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయి. అటు విశాఖకు.. ఇటు అమరావతి, రాయలసీమ వరకూ కాలువల ద్వారా నీటి మళ్లింపు సాధ్యమవుతుంది. మొత్తంగా కరువుంటే ఏపీనే సస్యశ్యామలం చేసే జాతీయ ప్రాజెక్ట్ ఇదీ. విభాజిత ఏపీకి ఈ అతిపెద్ద ప్రాజెక్ట్ కట్టే స్థోమత లేకపోవడం కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా మార్చి నిధులు వచ్చిస్తోంది. 2019 నుంచి దాదాపు రూ.6161 కోట్లను […]

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2022 6:22 pm
    Follow us on

    Polavaram : పోలవరం.. ఏపీ కలల వరం.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యితే ఏపీలోని సగం జిల్లాల తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయి. అటు విశాఖకు.. ఇటు అమరావతి, రాయలసీమ వరకూ కాలువల ద్వారా నీటి మళ్లింపు సాధ్యమవుతుంది. మొత్తంగా కరువుంటే ఏపీనే సస్యశ్యామలం చేసే జాతీయ ప్రాజెక్ట్ ఇదీ. విభాజిత ఏపీకి ఈ అతిపెద్ద ప్రాజెక్ట్ కట్టే స్థోమత లేకపోవడం కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా మార్చి నిధులు వచ్చిస్తోంది. 2019 నుంచి దాదాపు రూ.6161 కోట్లను కేంద్రం విడుదల చేసింది.

    Polavaram project

    అయితే రోజులు గడిచే కొద్దీ పోలవరం వెరీ కాస్లీ అవుతోంది. వ్యయం కోట్లో పెరుగుతోంది. 2017-18 అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయం రూ.47725 కోట్లకు పెరిగింది. దీంతో ఈ భారం మోయడం కేంద్రానికి తలకుమించిన భారం అవుతోంది. అందుకే అనుకున్న సమాయానికి పూర్తి కావడం లేదు. పూర్తి చేయడం కష్టంలా మారింది.

    అప్పుడెప్పుడూ వైఎస్ఆర్ హయాంలో మొదలైన పోలవరం కదలికను చంద్రబాబు ఏపీకి సీఎంగా అయ్యాక ప్రారంభోత్సవం చేశారు. ఆయన ఐదేళ్లలో దీన్ని పూర్తి చేయలేకపోయాడు. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యారు. జగన్ కూడా ఆర్భాటంగా ప్రారంభించారు. పాత కాంట్రాక్టులన్నీ రద్దు చేసి ప్రతిష్టాత్మక సంస్థ ‘మేఘా’కు పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చారు. కేంద్రం కొన్ని నిధులు ఇవ్వడంతో టాప్ వరకూ నిర్మించింది. కానీ వర్షాలు, వరదలు, సమస్యలతో జాప్యమైంది. నిధుల వ్యయం పెరిగింది. ఏపీ ఖజానా నిండుకోవడంతో చేతులెత్తేసింది. కేంద్రం కూడా నిధులు వెచ్చించినా పూర్తి కానీ ఈ ప్రాజెక్టుపై తాజాగా తమ వల్ల కాదంటూ వదిలేసుకుంది.

    2024 మార్చి నాటికి పూర్తికావాల్సిన పోలవరం ప్రాజెక్టు గడువులోగా పూర్తి చేయడం కష్టమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోలవరానికి రూ. 2441 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. పోలవరంపై వైసీపీ ఎంపీ చంద్రబోస్ అడిగిన ఈ ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది. దీంతో ఇప్పట్లో జగన్ హయాంలోనే పోలవరం పూర్తికాదన్న వాస్తవం వెలుగుచూసింది. జగన్ పూర్తి చేయడు.. కేంద్రం నిధులు ఇవ్వడం కష్టమని పేర్కొంది.