https://oktelugu.com/

Bigg Boss 5 telugu: షణ్ముక్ కు ముద్దు పెట్టిన సిరి.. అనీ సిరియస్.. వైరల్ వీడియో

Bigg Boss 5 telugu: బిగ్ బాస్ ఈసారి అంతకుమించి ఎంటర్ టైన్ మెంట్ అంటూ మన ముందుకు వచ్చింది. బోరింగ్ కు టాటా చెప్పండని సెలవిచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో తాజాగా బంధాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా షణ్ముఖ్-సిరి మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి మధ్యలో జశ్వంత్ ఫ్రెండ్ గా ముగ్గూరు చేసే సందడి అంతా ఇంతాకాదు.. ఈ క్రమంలోనే ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఒక హైలెట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2021 / 08:24 PM IST
    Follow us on

    Bigg Boss 5 telugu: బిగ్ బాస్ ఈసారి అంతకుమించి ఎంటర్ టైన్ మెంట్ అంటూ మన ముందుకు వచ్చింది. బోరింగ్ కు టాటా చెప్పండని సెలవిచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో తాజాగా బంధాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా షణ్ముఖ్-సిరి మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి మధ్యలో జశ్వంత్ ఫ్రెండ్ గా ముగ్గూరు చేసే సందడి అంతా ఇంతాకాదు..

    bigg boss telugu

    ఈ క్రమంలోనే ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఒక హైలెట్ సీన్ కనువిందు చేయనుంది. ఈ మేరకు ప్రోమో విడుదలైంది. షన్ముఖ్ జస్వంత్ బాధలో సోఫాలో కూర్చుండిపోయి తన ఫ్రెండ్ అయిన సిరీతో ‘మానసికంగా డిస్ట్రబ్ అయినప్పుడు ఎమోషనల్ గా అటాచ్ అయిపోతాం’ అని నిట్టూరుస్తాడు.. ‘నీ వల్లే మెంటల్ గా ఇబ్బంది పడుతున్నా’ అని సిరి అనడంతో దూరం పెట్టు అని షణ్ముఖ్ అంటాడు. ఈ క్రమంలోనే సిరీ వచ్చి షణ్ముఖ్ కు ఒక ఘాటు ముద్దు పెడుతుంది. ఇది కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇప్పటికే యూట్యూబర్ సునయనతో షణ్ముక్ లవ్ లో ఉన్నాడు. కానీ బిగ్ బాస్ లో సిరీతో ప్రేమగా ఉంటున్నాడు. ఈ ట్రైయాంగిల్ స్టోరీ ఏమవుతుందోనన్న భయం షణ్ముక్ ను వెంటాడుతోంది. అందుకే అలా అన్నాడని చెప్పొచ్చు.

    అనంతరం షణ్ముఖ్ ‘ఏంట్రా ఇదీ’ అంటూ కామెడీ పండిస్తాడు. దీన్ని మంచి గా రికార్డు చేయండని.. ప్రోమోల్లో పనికి వస్తుందని.. తన బతుకుబందరు బస్టాండ్ చేయడానికి ఈ ఒక్క ముద్దు చాలు అంటూ షణ్ముఖ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

    ఇక అనంతరం కెప్టెన్సీ టాస్క్ లో షణ్ముక్-సిరి కలిసి ఆడి ఆనీ మాస్టర్ ను ఓడించడంతో ఆమె కోపంతో షణ్ముక్ పై చిందులు తొక్కిన వైనం హైలెట్ అయ్యింది.

    మొత్తంగా ఈరోజు ఎపిసోడ్ లో షణ్ముక్-సిరి ముద్దు సీన్ బిగ్ బాస్ కే హైలెట్ గా నిలవనుందని అర్థమవుతోంది.