https://oktelugu.com/

Actor Surya: శివ పుత్రుడు డైరెక్టర్ తో సూర్య కొత్త ప్రాజెక్ట్…

Actor Surya: తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు లో కుడా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో కూడా హీరో సూర్యకి మార్కెట్ ఉందని చెప్పాలి. విభిన్నమైన కథను తెరకెక్కించడంలో హీరో సూర్య ముందుంటారు. సింగం సిరీస్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్నాయి. 2003లో విడుదలైన పితామగన్‌ తమిళనాడులో సూపర్ హిట్ సృష్టించింది. విక్రమ్‌,సూర్య కాంబినేషన్ లో దర్శకుడు బాలా ఈ మూవీ తెరకెక్కించారు.  ” శివ పుత్రుడు” పేరుతో తెలుగులో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 28, 2021 / 08:52 PM IST
    Follow us on

    Actor Surya: తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు లో కుడా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో కూడా హీరో సూర్యకి మార్కెట్ ఉందని చెప్పాలి. విభిన్నమైన కథను తెరకెక్కించడంలో హీరో సూర్య ముందుంటారు. సింగం సిరీస్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్నాయి.

    2003లో విడుదలైన పితామగన్‌ తమిళనాడులో సూపర్ హిట్ సృష్టించింది. విక్రమ్‌,సూర్య కాంబినేషన్ లో దర్శకుడు బాలా ఈ మూవీ తెరకెక్కించారు.  ” శివ పుత్రుడు” పేరుతో తెలుగులో కూడా విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. మళ్లీ సూర్య- బాల కాంబోలో ఎప్పుడు సినిమా తీస్తారా అని ఎదురు చూశారు అభిమానులు.  కానీ వీరిద్దరి కాంబినేషన్లో ఇంతవరకు ఏ చిత్రం తెరకెక్కలేదు. సుమారు 18 ఏళ్ల తర్వాత సూర్య- బాలా కాంబినేషన్లో విభిన్న కథతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించనుంది.  ఈ కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    ప్రస్తుతం సూర్య నటించిన ” జై భీమ్” నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల ఆదరణ పొందినది. ” ఇతరుక్కుమ్ తునిందవన్ ” ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానున్నాయి ఈ రెండు సినిమాలు సూర్య కి విజయాన్ని ఇస్తాయో లేదో అనేది చూడాలి. జై భీమ్ సినిమాలో సూర్య లాయర్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభిస్తుంది.