ప్రతి ఒక్కరూ ఎక్కువగా వినియోగించే అప్లికేషన్లలో వాట్సాప్ యాప్ ఒకటనే విషయం తెలిసిందే. వాట్సాప్ యాప్ సహాయంతో సులువుగా చాట్ చేయడంతో పాటు ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటినుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు ఒకరికొకరు కనెక్ట్ కావడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి వాట్సాప్ యాప్ ను ఎక్కువగా వాడుతున్నారు.
అయితే వాట్సాప్ ను వినియోగించాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. అయితే డేటాను పూర్తిగా వినియోగించినా, సిగ్నల్ లేకపోయినా వాట్సాప్ యాప్ ను ఉపయోగించడం అస్సలు సాధ్యం కాదు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ యాప్ ను వినియోగించడం సాధ్యమవుతుంది. ఎవరైతే ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ ను వాడాలనుకుంటారో వాళ్లు చాట్ సిమ్ ను కొనుగోలు చేయాలి.
https://www.chatsim.com/ ఈ వెబ్ సైట్ సహాయంతో వాట్సాప్ ను వాడటానికి స్పెషల్ సిమ్ ను కొనుగోలు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంటర్నెట్ ను వాడకుండా యాప్ లను రన్ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా చాట్ సిమ్ ను కొనుగోలు చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సాధారణ సిమ్ కు భిన్నంగా ఉండే ఈ చాట్ సిమ్ ఇంటర్నెట్ అవసరం లేకుండా యాప్ లను రన్ చేయడంలో తోడ్పడుతుంది.
మన దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా చాట్ సిమ్ ను వినియోగించే ఛాన్స్ ఉండగా ఈ సిమ్ సహాయంతో అన్ లిమిటెడ్ మెసేజ్ లతో పాటు ఎమోజీలను కూడా పంపే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ సిమ్ ఖరీదు 1800 రూపాయలు కాగా రీఛార్జ్ చేయడం ద్వారా ఈ సిమ్ వ్యాలిడిటీ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.