బిగ్ బాస్-4: కుమార్ సాయి అందుకే ఎలిమినేట్ అయ్యాడా?

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియపై ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ తనకు ఇష్టం వచ్చినట్లు ఎలిమినేట్ చేస్తున్నారనే ఆరోపణలు కొద్దిరోజులుగా జోరుగా జరుగుతోంది. బిగ్ బాస్ లో ముక్కుసూటిగా.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారే ఎలిమినేట్ అవుతున్నారు. డ్రామాలు ఆడేవారే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారని.. గేమ్ లో ఎంటట్మైనెంట్ చేయడం.. ఓటింగ్ లో తక్కువ […]

Written By: NARESH, Updated On : October 19, 2020 10:05 am
Follow us on

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియపై ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ తనకు ఇష్టం వచ్చినట్లు ఎలిమినేట్ చేస్తున్నారనే ఆరోపణలు కొద్దిరోజులుగా జోరుగా జరుగుతోంది.

బిగ్ బాస్ లో ముక్కుసూటిగా.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారే ఎలిమినేట్ అవుతున్నారు. డ్రామాలు ఆడేవారే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారని.. గేమ్ లో ఎంటట్మైనెంట్ చేయడం.. ఓటింగ్ లో తక్కువ ఓటింగ్ వచ్చాయని చెబుతూ ‘బిగ్ బాస్’ వారిని ఎలిమినేషన్ చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతోన్నాయి. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియ వివాదం కొనసాగుతూనే ఉంది.

బిగ్ బాస్ రియల్టీ షోలా కాకుండా డ్రామా షోగా మారుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కుమార్ సాయి ఎలిమినేషన్ కూడా ప్రేక్షకులు ముందస్తుగానే ఉహించినట్లు తెలుస్తోంది. కిందటిసారే హోస్టు నాగార్జున మొనాల్.. కుమార్ సాయిలను బ్యాగ్ సర్దుకోమణి చెప్పారు. అయితే వారిలో కేవలం కుమార్ సాయినే ఎలిమినేషన్ చేయడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.

వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన వారందరినీ బిగ్ బాస్ లో కంటెస్టులు టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇక కుమార్ సాయి బిగ్ బాస్ హౌస్ లో కుదురుకోవడానికి చాలా టైం తీసుకున్నాడు. ఇది అతడికి మైనస్ గా మారింది. ఇక పలుసార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నప్పటికీ ఈ ఆదివారం అతడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది.

బిగ్ బాస్-4 నుంచి ఎలిమినేట్ అయిన వారిని చూస్తుంటే వారికి బయటి నుంచి సోషల్ సైన్యం లేకపోవడమే ప్రధాన కారణంగా కన్పిస్తోంది. దర్శకుడు సూర్యకిరణ్.. కరాటే కల్యాణి.. కుమార్ సాయి తదితరులకు బయటికి నుంచి ప్రమోషన్లు.. సోషల్ మీడియాలో పెద్దగా సైన్యం లేదని తెలుస్తోంది. దీంతో వీరంతా ఓటింగ్ లో దూసుకెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

దీంతో ప్రతిభ ఉన్నా కూడా కొందరు ఎలిమినేట్ అవుతూ బిగ్ బాస్ వీడుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే కేవలం ప్రతిభ ఒక్కటే చాలదని.. ప్రమోషన్ కూడా ముఖ్యమని ప్రస్తుత ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే అర్థమవుతోంది.