https://oktelugu.com/

జగన్‌ కేబినెట్‌ నుంచి కొందరు ఇన్‌.. మరికొందరు ఔట్‌..?

ఏపీ సీఎం జగన్‌.. మరోమారు తన టీంను ప్రక్షాళన చేయబోతున్నారా..? ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో సమూల మార్పులు చేయాలని అనుకుంటున్నారా..? అవుననే వినిపిస్తున్నాయి సమాధానాలు. జగన్‌ అధికారంలోకి వచ్చాక.. తన టీంను ఏర్పాటు చేసుకునే సందర్భంలోనే ఓ మాట చెప్పారు. ప్రస్తుతం మంత్రులుగా పదవులు పొందుతున్న వారు రెండున్నరేళ్ల తర్వాత మార్పునకు రెడీ కావాలని సూచించారు. జగన్‌ తన కేబినెట్‌ను ఏర్పాటు చేసి ఏడాదిన్నర గడిచిపోయింది. జగన్‌ మాటల ప్రకారం.. మరో ఏడాదిలో మంత్రుల మార్పు ఖాయం. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2020 10:11 am
    Follow us on

    ఏపీ సీఎం జగన్‌.. మరోమారు తన టీంను ప్రక్షాళన చేయబోతున్నారా..? ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో సమూల మార్పులు చేయాలని అనుకుంటున్నారా..? అవుననే వినిపిస్తున్నాయి సమాధానాలు. జగన్‌ అధికారంలోకి వచ్చాక.. తన టీంను ఏర్పాటు చేసుకునే సందర్భంలోనే ఓ మాట చెప్పారు. ప్రస్తుతం మంత్రులుగా పదవులు పొందుతున్న వారు రెండున్నరేళ్ల తర్వాత మార్పునకు రెడీ కావాలని సూచించారు.

    జగన్‌ తన కేబినెట్‌ను ఏర్పాటు చేసి ఏడాదిన్నర గడిచిపోయింది. జగన్‌ మాటల ప్రకారం.. మరో ఏడాదిలో మంత్రుల మార్పు ఖాయం. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు తమ మంత్రి పదవులను కోల్పోనున్నారు..? ఏ నాయ‌కులు ఇంటి బాట ప‌ట్టనున్నారు ? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం జగన్‌ కేబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. వీరిలో ఒక్క హోం మంత్రి సుచరిత తప్ప మిగిలిన ఇద్దరికీ ఉద్వాసన పలికేలా ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దూకుడు లేక‌పోగా.. సొంత ఇంటి నుంచి జ‌గ‌న్‌పై విమ‌ర్శలు వచ్చాయి. అయినా ఆమె పెద్దగా స్పందించలేదు. తానేటి వ‌నిత‌.. టీడీపీకి కౌంట‌ర్లు ఇవ్వలేక‌పోతున్నారు. అసలు ఆమె మంత్రేనా..? అని సొంత పార్టీ నేత‌లే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరూ ఇంటి ముఖం ప‌ట్టడం ఖాయంగా క‌నిపిస్తోంది. వీరితోపాటు ప్రస్తుతం తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గుమ్మనూరు జ‌య‌రాం, మంత్రి నారాయ‌ణ స్వామిలకు కూడా జగన్‌ కేబినెట్‌ నుంచి పంపించబోతున్నారట.

    మ‌రో వృద్ధ మంత్రి శ్రీరంగ నాథ‌రాజుకు కూడా శ్రీముఖం త‌ప్పేలా లేద‌ని సమాచారం. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. జిల్లాల ప్రాతిప‌దికన కూడా మార్పులు త‌థ్యమ‌ని పార్టీ పెద్దలు చెబుతున్నారు. క‌డ‌ప జిల్లాలో వివాద ర‌హితుడే అయినా.. అంజాద్‌కు జిల్లా ప్రాతిప‌దిక‌న ప‌క్కన పెడ‌తారని అంటున్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గంలో మ‌రో నేత‌కు అవ‌కాశం ఇవ్వాలి కాబ‌ట్టి.. నెల్లూరులో మేక‌పాటి గౌతం రెడ్డిని మార్చడం ఖాయంగా క‌నిపిస్తోంది. యాద‌వ సామాజిక వ‌ర్గంలోనూ మార్పు త‌ప్పద‌ని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న అనిల్‌కుమార్ యాద‌వ్ ప్లేస్‌లో పెన‌మ‌లూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసార‌థి యాద‌వ్‌కు అవ‌కాశం ఇస్తార‌ని తెలుస్తోంది.

    మరోవైపు కొడాలి నాని పైనా అందరి ఆసక్తి ఉంది. అలాగే కొనసాగిస్తారా.. లేక మారుస్తారా..? అనేది త‌ర్జన భ‌ర్జనగా ఉంద‌ని అంటున్నారు. ఇక‌ ప‌శ్చిమ గోదావ‌రి నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు ఉన్న మంత్రుల్లో ఒక్క బొత్సకు మాత్రం ఛాన్స్ ఇచ్చి మిగిలిన వారిని మార్చడం ఖాయంగా క‌నిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి స్పీక‌ర్ త‌మ్మినేనికి ఛాన్స్ ఉంటుంద‌నే వార్తలు వ‌స్తున్నాయి. ఇక‌ మ‌హిళ‌ల్లో శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే ప‌ద్మకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఎస్సీ మంత్రుల విష‌యానికి వ‌స్తే.. కోరుముట్లకు అవ‌కాశం ఉంటుంద‌ని, ఆయ‌నను ఆదిమూల‌పు సురేష్ ప్లేస్‌లో మార్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మొత్తంగా జగన్‌ కేబినెట్‌ ప్రక్షాళనకు దిగితే.. ఈసారి భారీ ఎత్తునే మార్పులు జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.