
ఆన్ లైన్ మార్కెటింగ్ నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ‘స్టైమార్క్ మ్యాక్స్ హెడ్జ్’ పేరిట యాప్ రూపొందించి డిపాజిట్లు సేకరించారన్నారు. అధిక వడ్డీ వస్తుందని ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారన్నారు. అయితే కొంతమంది దీనిపై ఫిర్యాదు ఇవ్వడంతో అవినాశ్ రెడ్డి, చిట్టం రెడ్డి, శ్రీనివాస్, నందకిశోర్ లను పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా అన్ లైన్ మార్కెటంగ్ మోసాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ఆన్ లైన్ మోసగాళ్లను పోలీసులు పట్టుకుంటున్న ఇలాంటి వారి ఆగడాలుమాత్రం ఆగడం లేదు. దీంతో ఆన్ లైన్ మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు.