Veera Simha Reddy- Waltair Veerayya: చాలా కాలం తర్వాత చిరంజీవి-బాలకృష్ణ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. 2017లో చివరిగా ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలతో బాలకృష్ణ-చిరంజీవి పోటీపడ్డారు. 2023 సంక్రాంతి తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా ప్రత్యేకం కానుంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల కాలేదు. 2021, 2022 సంక్రాంతి సో సోగా ముగిసిపోయాయి. ఈసారి చిరు, బాలయ్యలతో పాటు విజయ్ ఢీ అంటూ ఢీ అంటున్నాడు స్టార్ హీరోల సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ కళకళలాడనున్నాయి. ఈ సినిమా పండగ కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే వాళ్ళ ఆశ అడియాశలు కావచ్చు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు సంక్రాంతికి విడుదల కావడం కష్టమే అంటున్నారు. కారణం… ఈ రెండు చిత్రాల షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. వీరసింహారెడ్డి షూట్ 5 రోజులు పెండింగ్ ఉంది. ఒక పాటను చిత్రీకరించాల్సి ఉందట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక ప్రక్క జరుగుతున్నా షూటింగ్ మాత్రం కంప్లీట్ కాలేదు.అలాగే థమన్ బీజీఎం వర్క్ పూర్తి చేయలేదట. ఈ క్రమంలో బాలయ్య సెట్స్ లో అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. దర్శకనిర్మాతలపై మండిపడ్డాడు.
ఇక వాల్తేరు వీరయ్య పరిస్థితి కూడా అదే. విడుదలకు నెల రోజులు కూడా లేదు… ఇంకా షూట్ చేస్తూనే ఉన్నాడు. వాల్తేరు వీరయ్య టీమ్ గుమ్మడికాయ కొట్టలేదనేది విశ్వసనీయ సమాచారం. కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సినవి ఉన్నాయట. ఈ రెండు చిత్రాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించడం కూడా ఒక సమస్యగా మారింది. జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఆ లెక్కన కనీసం 30 రోజుల సమయం లేదు.

ఈ తక్కువ సమయంలో షూట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ఫైనల్ కాపీ సిద్ధం చేయాలి. సమయం ముంచుకొస్తుంటే మేకర్స్ లో ఆందోళన పెరిగిపోతోందట. అనుకున్న సమయానికి చిత్రాలు విడుదల అవుతాయా అనే భయం వెంటాడుతోందట. ఏదైనా తేడా పడితే చివరి నిమిషంలో విడుదల వాయిదా పడవచ్చు అంటున్నారు. అలా కాదని పూర్తి స్థాయిలో సినిమాను సిద్ధం చేయకుండా విడుదల చేస్తే.. ఫలితం బెడిసి కొట్టొచ్చు. ఈ క్రమంలో సంక్రాంతి చిత్రాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల్లో ఏ ఒక్కటి వాయిదా పడినా… దిల్ రాజు పండగ చేసుకుంటాడు.