New Year 2025: కొత్త సంవత్సరం వేడుకలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అంతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వేడుకలు మొదలయ్యాయి కూడా. ఇక 2024కు వీడ్కోల పలికి.. 2025కి స్వాగతం పలికేందుకు హైదరాబాద్‌వాసులతోపాటు తెలంగాణ అంతటా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈతరుణంలో పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు. నగరంలోని ఫ్లైఓవర్లన్నీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అడుగడుగునా నిఘా ఉంటుందని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడంతోపాటు ట్రాఫిక్షలపైనా తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి అన్ని ఫ్లైఓవర్లు మూసి ఉంటాయని తెలిపారు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న అన్ని ఫ్లైఓవర్లును మూసివేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ పోలీసులు తెలిపారు. రాత్రి 10 నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూసి ఉంటాయని పేర్కొన్నారు. ఐటీ కారిడార్లతోపాటు అన్ని ప్రాంతాల్లో ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
ఓఆర్‌ఆర్‌పైనా ఆంక్షలు..
ఇక ఓఆర్‌ఆర్‌పైనా పోలీసులు ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు, ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ జోష్‌లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్‌పై కూడా పోలీసులు నిఘా ఉంచారు. న్యూ ఇయర్‌కు ఆనందంగా స్వాగతం పలకాలని కోరారు.
మూసివేసే ఫ్లై ఓవర్లు ఇవే..
లోయర్ ట్యాంక్‌బండ్‌స్టీల్ బ్రిడ్జ్
తెలుగు తల్లి ఫ్లైఓవర్
మాసాబ్‌ట్యాంక్
బేగంపేట, రసూల్‌పుర ఫ్లైఓవర్లు
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్
టౌలిచౌకి ఫ్లైఓవర్
గచ్చిబౌలి ఫ్లైఓవర్
జూపార్క్ మార్గంలోని ఫ్లైఓవర్లు