https://oktelugu.com/

CM Revanth Reddy: తెలంగాణ సీఎం ఆస్తి ఎంతో తెలుసా.. ఏడీఆర్‌ నివేదికలో ఆసక్తికర విషయాలు!

దేశంలో ముఖ్యమంత్రుల ఆస్తుల లెక్కలను ఏటా వివిధ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ముఖ్యమంత్రులకు వారి పనితీరు, ప్రజాదరణ ఆధారంగా కూడా ర్యాంకులు ఇస్తుంటాయి. తాజాగా ఏడీఆర్‌ సంస్థ ఆస్తుల వివరాలు వెల్లడించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 31, 2024 / 12:10 PM IST

    CM Revanth Reddy(10)

    Follow us on

    CM Revanth Reddy: దేశంలో 28 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల లెక్కలను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌(ఏఈఆర్‌) విడుదల చేసింది. ఈ నివేదికలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తెలంగాణ సీఎం ఆస్తుల జాబితాలో ఏడోస్థానంలో ఉన్నారు. రేవంత్‌రెడ్డి ఆస్తుల విలువను ఏడీఆర్‌ రూ.30.04 కోట్లుగా పేర్కొంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.931 కోట్లతో దేశంలోనే అత్యంత ఆస్తి ఉన్న సీఎంగా నిలిచారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేవలం రూ.15 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ.10 కోట్ల అప్పు ఉంది.

    ఏడో స్థానంలో తెలంగాణ సీకం..
    ఇక ఏడీఆర్‌ జాబితా ప్రకారం.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏడో స్థానంలో ఉన్నారు. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం రేవంత్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.30.04 కోట్లు. అదే సమయంలో రేవంత్‌కు రూ.1.3 కోట్లు అప్పులు కూడా ఉన్నాయి. పలువురు సీఎంలపై క్రిమినల్‌ కేసులు కూడా ఉండగా, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై దేశంలోనే అత్యంత ఎక్కువ కేసులు ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కూడా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

    ఆస్తుల్లో మిగతా సీఎంలు..
    ఇక ఆస్తుల విషయానికి వస్తే.. అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం ఫెమాఖండు రూ.330 కోట్లతో దేశంలో రెండో స్థానంలో ఉన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.51 కోట్ల ఆస్తితో జాబితాలో మూడోస్థానంలో ఉన్నారు. జమ్మూ సీఎం ఒమర్‌ అబ్దుల్లా చివరి నుంచి రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.50 లక్షలు మాత్రమే. కేరళ సీఎం పినయర్‌ విజయన్‌ చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి రూ.1.19 కోట్లు అని ఏడీఆర్‌ వెల్లడించింది.

    ఏపీ సీఎంలే అగ్రస్థానం..
    గత ఏడీఆర్‌ నివేదిక ప్రకారం.. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు. నాడు ఆయన ఆస్తి విలువ రూ.500 కోట్లుగా తెలిపింది. తాజాగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఈయన ఆస్తి విలువ రూ.931 కోట్లుగా వెల్లడించింది. ఇక మమతా బెనర్జీకి కేవలం రూ.15 లక్షలే ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.