Bheemla Nayak Collections : తెలుగు సినిమా ఇండస్ట్రీని బాహుబలి విశ్వవ్యాప్తం చేసింది. కోట్లు కొల్లగొట్టవచ్చని నిరూపించింది. అప్పటి నుంచి తెలుగు సినిమాల మార్కెట్ దేశవ్యాప్తమైంది. దానికిప్పుడు కరోనా కల్లోలం తర్వాత గట్టి ఊపు నిచ్చాడు ‘పవన్ కళ్యాణ్’. ‘భీమ్లానాయక్’ సినిమాతో టాలీవుడ్ కలెక్షన్ల ఊచకోత కోస్తున్నాడు.
భీమ్లానాయక్ మూవీకి తొలి రోజు నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ స్టైల్ యాక్టింగ్ తో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాన్ బేస్ ను భీమ్లానాయక్ మూవీ మరింత విస్తృతం చేసుకుంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో పవన్ సినిమాలకు భారీ వసూళ్లు వస్తున్నాయి.
తాజాగా భీమ్లానాయక్ మూవీ అయితే సంచలన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ఎవరూ ఊహించని రీతిలో వసూళ్లను రాబడుతోంది. అక్కడి అదిరిపోయే రికార్డులను సాధిస్తోంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘భీమ్లానాయక్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. భారత దేశం మొత్తం రూ.9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు మరో 9 కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ లెక్కన భీమ్లానాయక్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.106.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది.
Also Read: Bheemla Nayak Controversy: భీమ్లా నాయక్ కు తప్పని వివాదాల హోరు
‘భీమ్లానాయక్’ కు 4వ రోజు ఏపీ, తెలంగాణలో భారీ కలెక్షన్లు వచ్చాయి. సోమవారం సెలవు కావడంతో ఈ కలెక్షన్లు దక్కాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. నైజాంలో రూ.2.36 కోట్లు, సీడెడ్ రూ.752 లక్షలు, ఉత్తరాంద్రలో రూ.71 లక్షలు, ఈస్ట్ లో 35 లక్షలు, వెస్ట్ లో 21 లక్షలు, గుంటూరు 34 లక్షలు, కృష్ణాలో 32 లక్షలు, నెల్లూరులో 17 లక్షలు కలిపి రూ.5.18 కోట్లు షేర్, రూ.8.50 కోట్ల గ్రాస్ దక్కింది.
నాలుగు రోజులు ముగిసే సరికి బీమ్లానాయక్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ.58.25 కోట్ల షేర్, రూ.79.10 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఓవరాల్ ముగిసేసరికి ఖచ్చితంగా మూవీ 200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఊపు ఈ వారం అంతా కంటిన్యూ అయితే మాత్రం బాక్సాఫీస్ రికార్డులను పవన్ బద్దలు కొట్టేస్తాడు.