Bheemla Nayak Box Office Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. భీమ్లా నాయక్ కేవలం 3 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ను దాటేసినట్లు ట్రేడ్ పండితులు లెక్కగట్టారు. తొలిరోజు రూ.38 కోట్లు గ్రాస్ సంపాదించిన ఈ మూవీ మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.13.51కోట్లు, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకుంటే మొత్తం రూ.16.73కోట్ల షేర్ సాధించింది.
తొలి మూడు రోజుల్లో తెలంగాణలో రూ.25.88కోట్లు షేర్ వసూలు చేసింది. ఏపీలో రెండు రోజుల్లోనే రూ.27.19కోట్ల షేర్ వచ్చింది. ఈ రోజు బుకింగ్స్ ను బట్టి ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి. ఈ రోజు కలెక్షన్స్ ను అంచనాను బట్టి.. నైజాంలో రూ.39 కోట్లు, ఆంధ్రలో రూ.29 కోట్లు, సీడెడ్లో రూ.10 కోట్లు వచ్చే అవకాశం ఉందట.
Also Read: భోళా లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్ !
మొత్తానికి భీమ్లానాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద రప్ఫాడిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ దుమ్ము రేపుతోంది. అయితే, మరోపక్క భీమ్లానాయక్ సినిమా పై బురదజల్లడానికి వైసీపీ కార్యకర్తలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ సినిమాలో కుమ్మరుల మనోభావాలను కించపరిచారని ఆరోపిస్తూ ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఎం.పురుషోత్తం గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఎంతో పవిత్రంగా భావించే ‘కుమ్మరి చక్రాన్ని’ రానా కాలుతో తన్నే సన్నివేశం కుమ్మరులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే ఆ సన్నివేశం సినిమాలో నుంచి తొలగించాలని పురుషోత్తం డిమాండ్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాలో కుమ్మరుల మనోభావాలను కించపరిచే సీన్ ఒక్కటి కూడా లేదు.
Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి బిగ్ అప్ డేట్