https://oktelugu.com/

Bheemla Nayak Collections: బాక్సాఫీస్ బద్దలు.. భీమ్లానాయక్ 4వ రోజు కలెక్షన్స్ షాకింగ్

Bheemla Nayak 4th Day Collections Report : కరోనా కల్లోలం తర్వాత థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న వేళ విడుదలైన చిత్రం ‘భీమ్లానాయక్’. ఏపీలో ఆంక్షల మధ్య, తెలంగాణలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన పరిస్థితుల్లో ఈ మూవీ విడుదలైంది. ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. విడుదలైనప్పటి నుంచి మంచి టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈక్రమంలోనే శుక్రవారంతోపాటు శని, ఆదివారాలు వీకెండ్ కలిసి రావడంతో భీమ్లానాయక్ మూవీకి కలెక్షన్ల వర్షం […]

Written By: , Updated On : February 27, 2022 / 10:36 PM IST
TDP Bheemla Nayak

TDP Bheemla Nayak

Follow us on

Bheemla Nayak 4th Day Collections Report : కరోనా కల్లోలం తర్వాత థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న వేళ విడుదలైన చిత్రం ‘భీమ్లానాయక్’. ఏపీలో ఆంక్షల మధ్య, తెలంగాణలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన పరిస్థితుల్లో ఈ మూవీ విడుదలైంది. ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.

Pawan Kalyan Special Treat

Pawan Kalyan Special Treat

విడుదలైనప్పటి నుంచి మంచి టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈక్రమంలోనే శుక్రవారంతోపాటు శని, ఆదివారాలు వీకెండ్ కలిసి రావడంతో భీమ్లానాయక్ మూవీకి కలెక్షన్ల వర్షం కురిసింది. ఇక భీమ్లానాయక్ ఊపు సోమవారం కూడా కొనసాగింది. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మరీ హిట్ టాక్ వచ్చిన భీమ్లానాయక్ ను చూశారు.

పవన్ కళ్యాణ్ పర్ ఫామెన్స్, రానా ఎమోషన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. త్రివిక్రమ్ మాటలు సూపర్బ్ అంటున్నారు. ఇక తమన్ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం అదుర్స్ అంటున్నారు.

ఇలా అన్నీ కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.37.15 కోట్లు కలెక్షన్లు సాధించింది. ఇక రెండో రోజు శనివారం రూ.23 కోట్లు (సుమారు)గా సాధించినట్టు సమాచారు. ఇక మూడో రోజు ఉదయం 18 కోట్లు సాధించినట్టు తెలిసింది. సోమవారం వరకూ 150 కోట్లు దాటడం ఖాయం అని తేలింది. వారం రోజుల్లో 500 కోట్లు దాటిపోవడం ఖాయమని అంటున్నారు.

ఇక ఇండియాలోనే 150 కోట్లు అంటే ఇక అమెరికా, ఓవర్సీస్ కలెక్షన్లు చూస్తే 500 కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

Bheemla Nayak 3rd Day Collections Report || Beemla Nayak Public Talk || Pawan Kalyan || Rana