Noida Twin Towers Demolition: ఢిల్లీలో అక్రమంగా నిర్మించిన ట్విన్ టవర్స్ ను సుప్రీంకోర్టు ఆదేశంతో దిగ్విజయంగా కూల్చేశారు. అంతపెద్దవైన టవర్లను కూల్చేందుకు చుట్టుపక్కల ఉన్న భవంతుల్లోని అన్ని ఫ్లాట్ లను ఖాళీ చేయించారు. ఒకవేళ సైడ్ కు పడితే వారందరికీ ప్రాణాపాయం అని ఇలా ముందస్తు చర్యలన్నీ తసీుకున్నారు. పకడ్బందీగా చుట్టూ అరకిలోమీటర్ వరకూ మనుషులను, వారి వాహనాలను ఇతర సామగ్రిని అంతా తరలించి కూల్చేశారు.

అయితే ఇంత జరుగుతున్నా ఓ వ్యక్తి మాత్రం ఈ ట్విన్ టవర్స్ పక్కనే ఆదమరిచి గుర్రుపెట్టి పడుకున్నాడు. డెడ్ లైన్ టైం దాటినా బయటకు రాలేదు. గాఢ నిద్రలో ఉండిపోయాడు. ఓ భవంతిలోని అందరూ వెళ్లిపోగా ఒక వ్యక్తి మాత్రం బయటకు రాలేదు. కంగారు పడిన వారి వాళ్లు అధికారులకు తెలుపగా.. ఆయనను సిబ్బంది ఎలాగోలా లేపి ఉదయం 7 గంలకు బయటకు తీసుకురాగలిగారు. సెక్యూరిటీ గార్డులు ఈ కుంభకర్ణుడిని లేపి బయటకు తీసుకొచ్చారు.
Also Read: MP Gorantla Madhav Video Issue: గోరంట్ల మాధవ్ ఘటనపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. చర్యలకు ఆదేశం
సరిగ్గా అదే సమయంలో ఈ కూల్చివేత ప్రారంభమైంది. ఈ తరలింపు ప్రక్రియ అంతా సరిగ్గా చేసినా ఈ వ్యక్తి మాత్రం ఎలా అపార్ట్ మెంట్ పడుకొని ఉన్నాడని.. ఆ వ్యక్తి ఎలా మిస్ అయ్యారని టాస్క్ ఫోర్స్ కమిటీ ఆరా తీస్తోంది.

దాదాపు 3500 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి ఈ భారీ ట్విన్ టవర్స్ ను కూల్చారు. చుట్టుపక్కల వారందరినీ ఖాళీ చేయించారు. కానీ ఈ ఒక్కడు మాత్రం ఎలా మిస్ అయ్యాడన్నది ఇప్పటికీ మిస్టరీగా మారింది. అతడిని సెక్యూరిటీ బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
Also Read:Sara Bejlek: 16 ఏళ్ల యువ టెన్నిస్ క్రీడాకారిణితో ఆ ముద్దులు.. హగ్గులు ఆ చేష్టలేంటి.? వీడియో వైరల్
https://www.youtube.com/watch?v=5THwJgxJGv0

[…] […]
[…] […]