New Year Celebrations 2023: కొత్త సంవత్సరం వేళ కల్తీ పెరుగుతోంది. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులు రెచ్చిపోతారు. ఫుల్ గా తాగి మత్తులో జోగేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో నకిలీ మద్యం ఏరులై పారుతుంది. దీని కోసం మద్యం దుకాణాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పటికే నకిలీ మద్యం వైన్ షాపులకు చేరింది. మద్యం తాగే ముందు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాలం చెల్లిన మందును వాడేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పలు చోట్ల నకిలీ మద్యం పట్టుబడుతుండటంతో మద్యం ప్రియులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

నిర్మల్ జిల్లా కడెంలోని ఓ మద్యం దుకాణంలో కాలం తీరిన బడ్వైజర్ బీర్లు అమ్మడంతో వినియోగదారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో షాపు నిర్వాహకులు బీర్లు తీసుకుని డబ్బు వాపసు చేశారు. దీంతో నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని అనుమానిస్తున్నారు. కాలం చెల్లిన బాటిళ్లు ఇదివరకే పంపిణీ చేసినట్లు పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. డిసెంబర్ 31 అంటే ఎంజాయ్ కే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులో భాగంగానే కాలం చెల్లిన మద్యాన్ని ఎంత భారీ మొత్తంలో అమ్మితే అంత లాభం వస్తుందని నమ్ముతున్నారు. దీని కోసమే నకిలీ మద్యం ప్రభావం పెరిగింది. బడ్వైజర్ బీర్లతో జాగ్రత్త సుమా. ఏమరుపాటుగా ఉంటే అంతే. నకిలీవి మన చెంతకు చేరడం ఖాయం.
కాలం చెల్లిన బీర్లను అమ్మడానికి చూసిన వారిని శిక్షించాలని మందుబాబులు డిమాండ్ చేయడంతో ఎక్సైజ్ అధికారులు వారిపై కేసులు పెడతామని భరోసా కల్పించారు. జనవరి 1న నూతన సంవత్సర వేడుకలకు కూడా మద్యం పెద్ద మొత్తంలోనే తాగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జనవరి ఫస్ట్ ఆదివారం రావడంతో మందుబాబులకు పండగే. విచ్చలవిడిగా తాగి ఎంజాయ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కాటన్ ల కొద్దీ బీర్లు, మద్యం బాటిళ్లు తెప్పించుకుంటున్నారు.

సందట్లో సడేమియాగా నకిలీ మద్యం పంపిణీ చేసేందుకు ఆయా సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. మద్యం దుకాణాలకు లెక్కలేనన్ని మద్యం బాటిళ్లు సరఫరా చేస్తున్నారు. దీంతో వాటి మధ్యన అక్కడో కాటన్ పెడుతూ కాలం తీరిన వాటిని విక్రయించాలని చూస్తున్నారు. అందరు పరిశీలనగా చూడరు. కొందరు మాత్రం దాని లేబుల్ చూసి మరీ కొంటారు. ఇంకొందరు ఏది ఇస్తే దాన్ని తీసుకెళ్లి తాగుతుంటారు. అలాంటి వారికి కాలం చెల్లిన వాటిని అంటగట్టేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ 31 మందుబాబులకు కిక్కేమో కానీ నకిలీ మద్యం భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో వారి ఎంజాయ్ మెంట్ ఏమో కాని కాలం చెల్లిన మద్యం తాగొద్దని జాగ్రత్తగా ఉండాలని చూసుకుంటున్నారు.