Sreeleela: కొందరు హీరోయిన్స్ అదృష్టాన్ని బ్యాక్ పాకెట్ లో పెట్టుకొని వస్తారు. పెద్దగా శ్రమ పడకుండానే ఆఫర్స్ వారిని వెంటాడతాయి. వద్దన్నా హిట్స్ వచ్చి పడుతూ ఉంటాయి. అలాంటి హీరోయిన్స్ లిస్ట్ లో కన్నడ భామ శ్రీలీల కొత్తగా చేరింది. కన్నడ చిత్రం ‘కిస్’ తో శ్రీలీల సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ కొట్టింది. ఇక పెళ్లి సందD మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. సినిమా ఫలితం పక్కన పెడితే… శ్రీలీల గ్లామర్, డాన్స్ మెస్మరైజ్ చేశాయి. టాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకర్షించిన శ్రీలీలకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.

శ్రీలీల లేటెస్ట్ ధమాకా సూపర్ హిట్. మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకున్న ధమాకా ఊహించని విజయం సాధించింది. అదంతా శ్రీలీల అదృష్టమే అనుకోవాలి. అమ్మడు లెగ్ పవర్ తో ప్లాప్ కావాల్సిన మూవీ కనక వర్షం కురిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ రెండు ప్లాప్స్ ఇచ్చిన రవితేజ గ్రేట్ కమ్ బ్యాక్ అయ్యారు. ధమాకా హిట్ తో శ్రీలీల రేంజ్, ఇమేజ్ పెరిగింది. దీంతో శ్రీలీల రెమ్యూనరేషన్ పెంచేశారనే ప్రచారం జరుగుతుంది. అయినా మేకర్స్ వెనకాడటం లేదట. కోరినంత ఇచ్చి తమ సినిమాల్లో ఆఫర్ ఇచ్చేందుకు సిద్దపడుతున్నారట.
కాగా ఇటీవల ఆమెపై ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. డీజే టిల్లు సీక్వెల్ డీజే స్క్వేర్ నుండి ఆమె తప్పుకున్నారంటూ ప్రచారం జరిగింది. హీరో సిద్ధు జొన్నలగడ్డ తీరు నచ్చని శ్రీలీల ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారన్న కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై శ్రీలీల స్పందించారు. సదరు వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. అసలు డీజే టిల్లు స్క్వేర్ సినిమాకు నేను సైన్ చేయలేదు. ఆ ప్రాజెక్టు నుండి తప్పుకోనూ లేదు. అవన్నీ నిరాధార కథనాలని స్పష్టత ఇచ్చారు.

డీజే టిల్లు స్క్వేర్ చిత్రం నుండి హీరోయిన్స్ ఒక్కొక్కరిగా తప్పుకుంటున్న తరుణంలో శ్రీలీలపై వచ్చిన వార్తలు నిజమే అని జనాలు నమ్మారు. డీజే టిల్లు స్క్వేర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. అధికారికంగా ప్రకటించారు కూడాను. కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్న అనుపమ ప్రాజెక్ట్ చేయనని వదిలేశారు. అనుపమ తప్పుకున్నాక మరో మలయాళ హీరోయిన్ మడోనా సెబాస్టియన్ ని తీసుకున్నారు. గత ఏడాది విడుదలైన డీజే టిల్లు మంచి విజయం సాధించింది.