Banned Indian Movies List : సెన్సార్ నిషేధించిన గొప్ప చిత్రాలు ఇవే.. ఇవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? వీటి బ్యాన్ వెనుక కథ ఏమిటి?

  Banned Indian Movies List కొన్ని సంచలనాత్మక ఇండియన్‌ చిత్రాలను కేంద్ర సెన్సార్‌ బోర్డ్ బ్యాన్‌ చేసింది. ముఖ్యంగా ఈ చిత్రాలను పిల్లలు అస్సలు చూడకూడదు అని సర్టిఫై చేసింది. వీటికి కారణం.. కొన్ని చిత్రాల్లో అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉండటం ఓ కారణమైతే, మరికొన్ని చిత్రాలు అనేక వివాదాలకు కారణం అవ్వడం, అలాగే కొన్ని చిత్రాలు తప్పుడు దారిపట్టించే కంటెంట్‌ ను హైలైట్ చేయడం మరో కారణం. మొత్తమ్మీద ఈ 7 టాప్ చిత్రాలు […]

Written By: NARESH, Updated On : March 29, 2023 9:56 pm
Follow us on

 

Banned Indian Movies List కొన్ని సంచలనాత్మక ఇండియన్‌ చిత్రాలను కేంద్ర సెన్సార్‌ బోర్డ్ బ్యాన్‌ చేసింది. ముఖ్యంగా ఈ చిత్రాలను పిల్లలు అస్సలు చూడకూడదు అని సర్టిఫై చేసింది. వీటికి కారణం.. కొన్ని చిత్రాల్లో అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉండటం ఓ కారణమైతే, మరికొన్ని చిత్రాలు అనేక వివాదాలకు కారణం అవ్వడం, అలాగే కొన్ని చిత్రాలు తప్పుడు దారిపట్టించే కంటెంట్‌ ను హైలైట్ చేయడం మరో కారణం. మొత్తమ్మీద ఈ 7 టాప్ చిత్రాలు బ్యాన్‌ అయ్యాయి. మరీ ఆ చిత్రాలేమిటి ? ఎందుకు అవి బ్యాన్ అయ్యాయో ? తెలుసుకుందాం రండి.

ముందుగా బ్యాన్ అయిన సినిమాల లిస్ట్ లో ఉంది `గాండు` :

ఇదొక బెంగాలీ చిత్రం. ఈ సినిమాలో హీరోను అందరూ ’గాండు’ అని పిలుస్తారు. ఇందులో ఓరల్‌ సెక్స్ సన్నివేశాలు, నగ్నత్వం ఎక్కువుగా ఉంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రూపొందిన ఈసినిమా భారతీయ సెన్సిబులిటీస్‌ని అతిక్రమించినందుకుగానూ బ్యాన్‌ చేశారు. అయితే, ఈ సినిమా పలు విదేశీ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మంచి పేరు తెచ్చుకోవడం విశేషం. కానీ, ఈ సినిమాలో ఒరల్ సెక్స్, అసభ్యకరమైన సీన్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ సినిమాను ఫ్యామిలీతో చూడలేం. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

ఈ లిస్ట్ లో తర్వాత సినిమా విషయానికి వస్తే `ఫైర్‌` :

1996లో దీపా మెహతా రూపొందించిన ఈ `ఫైర్‌` చిత్రం కూడా బ్యాన్ కి గురి అయ్యింది. హిందూ కుటుంబంలో పుట్టిన ఇద్దరు లెస్బియన్‌ సోదరీమణుల మధ్య సాగే అక్రమ సంబంధాన్ని హైలైట్ చేస్తూ ఈ చిత్రం సాగింది. అందుకే, ఈ సినిమాని అనేక హిందుత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేశారు. కాకపోతే.. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రశంసలందుకుంది. ఈ `ఫైర్‌` చిత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

ఈ లిస్ట్ లో నెక్స్ట్ సినిమా `బ్లాక్‌ ప్రైడే` :

క్రేజీ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ 2004లో రూపొందించిన ఈ `బ్లాక్‌ ప్రైడే`చిత్రం కూడా బ్యాన్‌ అయ్యింది. కారణం.. ముంబయి బాంబ్‌ బ్లాస్ట్ పై రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. దీన్నొక చీకటి చిత్రంగా భావించారు. అనేక వివాదాలకు కూడా ఈ సినిమా కారణం అయ్యింది. అందుకే ఈ సినిమాని బ్యాన్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

నెక్స్ట్ ఈ బ్యాన్‌ చిత్రాల లిస్ట్ లో ఉన్న సినిమా `బందిత్‌ క్వీన్‌` :

1994 లో ఈ `బందిత్‌ క్వీన్‌` సినిమా తెరకెక్కింది. మాజీ బందిపోటు, రాజకీయ నాయకురాలు పూలన్‌ దేవి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అసలు పూలన్‌ దేవి బందిపోటుగా మారడానికి కారణమేంటి ? అనే కోణంలో సాగింది ఈ సినిమా. అయితే, ఈ చిత్రంలో ఎక్కువగా సెక్స్‌ వల్‌ కంటెట్‌, న్యూడిటి అలాగే అసభ్య పదజాలం ఎక్కవ అవ్వడంతో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. ఈ సినిమాని కూడా పిల్లలతో కలిసి పేరెంట్స్ అసలు చూడలేరు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

తర్వాత సినిమా `ఫిరాక్‌` :

గుజరాత్‌ అల్లర నేపథ్యంలో వచ్చిన `ఫిరాక్‌` చిత్రం 2008లో బ్యాన్‌ అయ్యింది. దర్శకురాలు నందితా దాస్‌ ఈ చిత్రాన్ని హిందువులు, ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా తీశారు. దాంతో ఈ చిత్రం పై అనేక విమర్శలు వచ్చాయి. ఫలితంగా కేంద్ర సెన్సార్‌ బోర్డ్ ఈ సినిమాని బ్యాన్‌ చేసింది. కాకపోతే, ఆ తర్వాత చాలా రోజుల తర్వాత విడుదలై ప్రశంసలందుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం జియో సినిమాలో అందుబాటులో ఉంది.

ఈ లిస్ట్ లో తర్వాత సినిమా విషయానికి వస్తే పాంచ్:

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా `పాంచ్‌`ను కూడా బ్యాన్‌ చేశారు. కారణం ఈ సినిమాలో సెక్సువల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే డ్రగ్స్ మాఫియా, మర్డర్ కేస్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. దాంతో ఈ సినిమాను సెన్సార్ బోర్డ్ నిషేధించింది. అయితే ఆ తర్వాత కొన్ని కట్స్ తో ఈ సినిమా విడుదలకు పర్మిషన్ ఇచ్చినా.. మేకర్స్ ఈ సినిమాని విడుదల చేయలేదు. ఈ చిత్రం ప్రస్తుతం ముబి లో అందుబాటులో ఉంది.

నెక్స్ట్ ఈ బ్యాన్‌ చిత్రాల లిస్ట్ లో ఉన్న సినిమా ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ :

ఇదొక బ్లాక్ కామెడీ చిత్రం, ఈ సినిమాలో కూడా బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటం, అనేక వివాదాలకు దారితీయడంతో ఈ చిత్రాన్ని కూడా సెన్సార్ బోర్డ్ నిషేధించింది. అలంకృత శ్రీవాత్సవ అనే ఒక అమ్మాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. మొత్తానికి పై ఈ 7 సినిమాల పై అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో బ్యాన్‌ చేశారు. ఐతే, వీటిలో ‘గాండు’, `ఫైర్‌`, `ఫిరాక్‌`, `బందిత్‌ క్వీన్‌` వంటి కొన్ని చిత్రాలు జాతీయ స్థాయిలో ప్రశంసలందుకోవడం విశేషం. ఇది.. గొప్ప ప్రశంసలు అందుకున్న చిత్రాల బ్యాన్ కథ.