KCR vs Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భాష కాస్త వేగంగా పలికినా ఆయన పంచులు మాత్రమ భలే పేలుస్తాడు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్.. ఆయన ఫ్యామిలీపై బండి చేసే కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. ఇంతలా కేసీఆర్ ఫ్యామిలీని తిట్టే ప్రత్యర్థులు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా పాదయాత్ర ప్రారంభం సందర్భంగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మనం రోడ్లమీద తిరుగుతుంటే… ఈ సమయానికి కేసీఆర్ 6 పెగ్గులు వేసి ఉంటాడు అని బండి సంజయ్ సెటైరికల్ గా వేసిన పంచులు బాగా పేలాయి.

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం లోని రాంపూర్ గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బండి సంజయ్ కేసీఆర్ ను తూర్పార పట్టారు. తెలంగాణ సొమ్ము దోచుకుని కేసీఆర్ కూతురు ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తోందని ఆరోపించారు. ఈ దందాలు అన్నీ కెసిఆర్ కుటుంబానివేనన్నారు. 1400 మంది పేదోళ్ల ఆత్మబలి దానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, కెసిఆర్ అనే మూర్ఖుడి చేతిలో పెట్టినామని విమర్శించారు. కెసిఆర్ కుటుంబం పాలించడానికి మనం తెలంగాణ రాష్ట్రం సాధించామా? కెసిఆర్ కూతురు దందా చేస్తే, కవితపై కేసు పెట్టారంట అని నిప్పులు చెరిగారు.
కెసిఆర్ కి మళ్ళీ ఒకసారి ఓటు వేస్తారా? మనం రోడ్లమీద తిరుగుతుంటే… ఈ సమయానికి కేసీఆర్ 6 పెగ్గులు వేసి ఉంటాడు. పాదయాత్రలో మేము ఎక్కడికి వెళ్లినా… ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి, మాకు ఘనస్వాగతం పలుకుతున్నారు. మనం కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది’ అని బండి తెలిపారు.
రైతులకు రుణమాఫీ చేయలేదు.. దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు ఇవ్వలేదు. ఎంతసేపు రాంపూర్ వాళ్ళ కొంప ముంచాలనే కేసీఆర్ చూస్తాడు. తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుగా మార్చిండు. పుట్టబోయే బిడ్డ నెత్తి పై కూడా లక్ష రూపాయలు అప్పు పెట్టిండని విమర్శించారు. తెలంగాణకు రెండు లక్షల 40వేల ఇండ్లను మోడీ మంజూరు చేశారు. మోడీ మంజూరు చేసిన ఇండ్లను కూడా కేసీఆర్ కట్టించడం లేదు. టిఆర్ఎస్ నేతలకు కబ్జాలు చేయడం తప్ప, అభివృద్ధి చేయడం తెలియదు ధరణి పోర్టల్ పేరుతో పేదోళ్ల జాగాలను గుంజుకుంటున్నారని విమర్శించారు.

హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువ చేసే జాగాలను కబ్జా చేసేందుకే ధరణి పోర్టల్ తెచ్చిండని బండి సంజయ్ ఆరోపించారు. కెసిఆర్ మోసపూరిత మాటలను నమ్మొద్దు నేను చెప్పే వివరాలు తప్పైతే… నాపై కేసు పెట్టండని బండిసంజయ్ సవాల్ చేశారు.
ఉచిత బియ్యం మోడీ ఇస్తుంటే… రేషన్ షాపుల వద్ద కేసీఆర్ తన ఫోటో పెట్టుకుంటున్నాడు. కిలోకు 29 రూపాయలు భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం గొప్పదా…? రూపాయి వసూలు చేస్తున్న కేసీఆర్ గొప్పోడా? చివరికి బాత్రూంల వద్ద కూడా కేసీఆర్ తన ఫోటో పెట్టించుకుంటున్నాడని బండి విమర్శించారు.
కెసిఆర్ గడీలను బద్దలు కొట్టాలి. ఇప్పుడు ఎన్నికలు లేవు… నేను ఓట్ల కోసం రాలేదు. నేను ఇక్కడ పోటీ చేసే వాడిని కాను. కుటుంబాలను వదులుకొని మీకోసమే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నాం. పేదోళ్ల రాజ్యం రావాలి… మీ బతుకులు బాగుపడాలని బండి సంజయ్ అన్నారు.
అనంతరం బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరిన పలువురు టిఆర్ఎస్ నేతలను ఆహ్వానించారు. చేర్చుకున్నారు.