Chiranjeevi Tweet: రాజమౌళి సినిమా విడుదలైనపుడల్లా అంతర్జాతీయంగా మనకి సరికొత్త మర్కెట్స్ ఓపెన్ అవుతూ వస్తున్నాయి..ఇక ఈ ఏడాది #RRR సినిమా విడుదలైన తర్వాత మనకి పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు శాశ్వతమైంది..హాలీవుడ్ సినిమాల మధ్యలో మన తెలుగు సినిమా ని చూస్తుంటే ఎంత గర్వంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది..మన సినిమా ని విదేశీయులు చూస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తారు అనేది బహుశా మనం గతం లో కలలో కూడా ఊహించి ఉండము.

అలాంటి అనితర సాధ్యమైన ఫీట్స్ ని #RRR సినిమా ద్వారా రాజమౌళి ఎన్నో చూపించాడు..ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఘనకీర్తి రాజమౌళి ఖాతాలో చేరుకుంది..అదేమిటి అంటే రాజమౌళి కి ఈ సంవత్సరం ‘న్యూ యార్క్ క్రిటిక్స్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది..ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవ్వబడే ఈ అవార్డు ఈ ఏడాది రాజమౌళి కి దక్కడం చరిత్రలో ఎన్నడూ మర్చిపోలేనిదిగా చెప్పుకోవచ్చు..మిగిలిన అన్ని క్యాటగిరీలలో హాలీవుడ్ మూవీస్ కి అవార్డ్స్ రాగా..డైరెక్టర్స్ జాబితాలో మాత్రం రాజమౌళి కి ఈ అవార్డు దక్కింది.
ఇక ఈ సినిమాలో ఒక హీరో గా నటించిన రామ్ చరణ్ కి కూడా రాజమౌళి రేంజ్ లోనే గౌరవాలు దక్కుతున్నాయి..నిన్న ఢిల్లీ లో జరిగిన NDTV ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో రామ్ చరణ్ కి ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డు దక్కింది..ఈ అవార్డు దక్కించుకోవడానికి నామినేషన్స్ లో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఉన్నాడు..కానీ వీళ్ళిద్దరిలో రామ్ చరణ్ కి అత్యధిక ఓట్లు రావడం తో ఆయనకే ఈ అవార్డు దక్కింది.

కొడుకుకి అంత ప్రెస్టీజియస్ అవార్డు దక్కడం తో తండ్రి చిరంజీవి పుత్రోత్సాహం తో పొంగిపోతూ ఆయన సోషల్ మీడియా లో పెట్టిన పోస్టులు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి..’నాన్న, నిన్ను చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను..నీకు NDTV ట్రూ లెజెండ్ – ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు రావడం నాకు మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది’ అంటూ చిరంజీవి ఎమోషనల్ గా పోస్టు పెట్టాడు..దీనిని చూసి అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు.