https://oktelugu.com/

బరాత్ చోరీలు.. ఒక్కరికి రూ.12 లక్షలు

ఢిల్లీలో నయా దందా వెలుగుచూసింది. బిగ్ షాట్స్, సంపన్నుల పెళ్లిళ్లను టార్గెట్ చేయడం.. అందులో సూట్ బూటు వేసి పిల్లలను పంపడం.. భారీగా నగదు, బంగారం దొంగతనాలు చేయించడాన్ని ఓ ముఠా చేస్తోంది. వరుసగా పెళ్లిళ్లలో జరుగుతున్న ఈ దొంగతనాలపై పోలీసులు పరిశోధన చేపట్టగా నమ్మలేని వాస్తవాలు వెలుగుచూశాయి. Also Read: బ్యాంకు లావాదేవీ ఫెయిలైందా.. అయితే రోజుకు 100 పొందే ఛాన్స్..? ఓ గ్యాంగ్ పిల్లలతో ఈ దొంగతనాలు చేస్తున్నట్టు వెలుగుచూసింది.పిల్లలను లీజుకు ఇచ్చినందుకు గాను […]

Written By:
  • NARESH
  • , Updated On : December 5, 2020 / 05:46 PM IST
    Follow us on

    ఢిల్లీలో నయా దందా వెలుగుచూసింది. బిగ్ షాట్స్, సంపన్నుల పెళ్లిళ్లను టార్గెట్ చేయడం.. అందులో సూట్ బూటు వేసి పిల్లలను పంపడం.. భారీగా నగదు, బంగారం దొంగతనాలు చేయించడాన్ని ఓ ముఠా చేస్తోంది. వరుసగా పెళ్లిళ్లలో జరుగుతున్న ఈ దొంగతనాలపై పోలీసులు పరిశోధన చేపట్టగా నమ్మలేని వాస్తవాలు వెలుగుచూశాయి.

    Also Read: బ్యాంకు లావాదేవీ ఫెయిలైందా.. అయితే రోజుకు 100 పొందే ఛాన్స్..?

    ఓ గ్యాంగ్ పిల్లలతో ఈ దొంగతనాలు చేస్తున్నట్టు వెలుగుచూసింది.పిల్లలను లీజుకు ఇచ్చినందుకు గాను ఒక్కొక్క పిల్లవాడి తల్లిదండ్రులకు ఏకంగా రూ.10-12 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. పెళ్లిళ్లలో దొంగతనం ఎలా చేయాలో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారట..

    పిల్లలకు మంచి దుస్తులు ధరింపచేస్తున్నారు. అతిథులతో కలిసిపోయేలా శిక్షణ ఇస్తున్నారు. దొంగతనం చేసి పట్టుబడినప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసింది. బిగ్ షాట్స్ పెళ్లిళ్లకు పిల్లలను పంపి ఈ దొంగతనాలు చేయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

    Also Read: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

    ఢిల్లీలోని పలు ఫంక్షన్ హాల్స్ లో బడాబాబుల పెళ్లిళ్లలో భారీగా నగలు, డబ్బు మాయం అవుతోంది. అతిథులు పెళ్లి హడావుడిలో ఉండగా.. దొంగలు పనికానిచ్చేస్తున్నారు. రెండు మూడు నెలలుగా ఈ తరహా దొంగతనాలకు సంబంధించి లెక్కలేనన్ని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. నగరంలో భారీ వివాహ వేడుకలు జరిగే ఫంక్షన్‌ హాల్స్‌ వివరాలు సేకరించి.. అక్కడికి వెళ్లి దర్యాప్తు చేశారు. సీసీటీవీ కెమరా రికార్డులను పరిశీలించారు. ఇక కొన్ని ఫంక్షన్‌ హాల్స్‌ దగ్గర ఇన్‌ఫార్మర్లను ఉంచారు. అనుమానితులకు సంబంధించిన సమాచారం బయటపడింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్