Balakrishna: పొట్టోడికి పుట్టెడు బుద్దులు.. అల్లు అరవింద్ ను అంత మాట అనేసిన బాలయ్య.. వీడియో

సాధారణంగా మనం ఎవరినైనా పొగడాలి అంటే కొంచెం మంచి పదాలు వాడుతాం.. ‘గారు, లెజెండ్, సెలబ్రెటీ, వ్యాపార దక్షుడు, టాలెంటెడ్, గొప్పొళ్లు,’ ఇక అంతకుమించిన పదాల కోసం వెతుకుతాం.. కానీ మన బాలయ్య బాబు రూటే సపరేట్. ఆయన మైక్ అందుకున్నాడు. ‘ఆహా’ ఓటీటీలో ‘అన్ స్టాపబుల్ ’ అంటూ జరిగే కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమంలో నందమూరి బాలక్రిష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై నిర్మాత అల్లు అరవింద్ పై హాట్ కామెంట్స్ […]

Written By: NARESH, Updated On : October 14, 2021 7:22 pm
Follow us on

సాధారణంగా మనం ఎవరినైనా పొగడాలి అంటే కొంచెం మంచి పదాలు వాడుతాం.. ‘గారు, లెజెండ్, సెలబ్రెటీ, వ్యాపార దక్షుడు, టాలెంటెడ్, గొప్పొళ్లు,’ ఇక అంతకుమించిన పదాల కోసం వెతుకుతాం.. కానీ మన బాలయ్య బాబు రూటే సపరేట్. ఆయన మైక్ అందుకున్నాడు. ‘ఆహా’ ఓటీటీలో ‘అన్ స్టాపబుల్ ’ అంటూ జరిగే కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమంలో నందమూరి బాలక్రిష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై నిర్మాత అల్లు అరవింద్ పై హాట్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఎన్నో ఓటీటీలున్నాయి. దేశంలో నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ లాంటి అంతర్జాతీయ ఓటీటీలతో పోటీపడుతూ తెలుగు వారి సత్తాను చాటేందుకు రెడీ అయిన అల్లు అరవింద్ పై బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

తెలుగు ఓటీటీ అనే ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నాట్టు బాలయ్య కూడా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ను పొగుడుతూ నోరు జారేశారు. ‘పొట్టివాళ్లకు పుట్టెడు బుద్దులు అని ఇన్ని ఓటీటీల మధ్య తెలుగు ఓటీటీని ప్రారంభించి సత్తా చాటుతున్నాడు అల్లు అరవింద్’ అని బాలయ్య తిట్టాడో పొగిడాడో అర్థం కాకుండా ఓ మాట అయితే అనేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

ఇక అల్లు రామలింగయ్య తమ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడని.. తమ వంటింట్లోకి కూడా వచ్చి మా అమ్మను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడో ఆ బండోడు(ఎన్టీఆర్) అని అడిగి తెలుసుకునే వాడని బాలయ్య పాత జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. నాన్న ఎన్టీఆర్ ను సైతం తిట్టగల పెద్దమనిషి ఇండస్ట్రీలో కేవలం అల్లు రామలింగయ్య గారేనని బాలయ్య గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ను పొట్టివాడంటూ బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వీడియో ఇదే