https://oktelugu.com/

Shyam Singaroy అభిమానులకు శ్యామ్ సింగరాయ్ మూవీ… నుంచి మరో గిఫ్ట్ ఇచ్చిన నాని

Shyam Singaroy నేచురల్ స్టార్ నాని… తనదైన నటనతో తీలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల నాని… వీ , టక్ జగదీష్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టుగా ఓటిటి లో రిలీజ్ అయిన ఈ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి . ఇదిలా ఉండగా ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని డ్యూయెల్ రోల్ లో నటిస్తూ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ”శ్యామ్ సింగ రాయ్”. కలకత్తా బ్యాక్ డ్రాప్ తో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 14, 2021 / 07:39 PM IST
    Follow us on

    Shyam Singaroy నేచురల్ స్టార్ నాని… తనదైన నటనతో తీలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల నాని… వీ , టక్ జగదీష్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టుగా ఓటిటి లో రిలీజ్ అయిన ఈ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి . ఇదిలా ఉండగా ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని డ్యూయెల్ రోల్ లో నటిస్తూ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ”శ్యామ్ సింగ రాయ్”.

    కలకత్తా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందుతుంది అని తెలుస్తుంది. తాజాగా దసరా పండగ సందర్భంగా నాని రెండో పాత్ర వాసుని ప్రేక్షకులకు పరిచయం చేసింది చిత్ర యూనిట్. కాళీ మాత ఆలయంలో శ్యామ్ సింగ రాయ్ ని చూపిస్తూ… కాళీ మాత పోస్టర్ నుంచి వాసు లుక్ ని రివీల్ చేశారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

    https://twitter.com/NameisNani/status/1448599211646148609?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1448599211646148609%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fmanalokam.com%2Fcinema%2Fnanis-shyam-singha-roy-release-date-is-confirmed.html

    మిక్కీ జె మేయర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కాళీమాత నేపథ్యంలో ఉన్న నాని ఫోటో ఆకర్షణీయంగా ఉంది. వాసుగా గుబురు గడ్డం, వెరైటీ హెయిర్ స్టైల్‌తో నాని కనిపించాడు. అతని ప్రేమ, అతని వారసత్వం, అతని మాట అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ విడుదల చేశారు. శ్యామ్ సింగ రాయ్ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వి.ఎఫ్.ఎక్స్. కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతోందని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెలిపారు.