Actor Naresh: ఒక చిన్న కుటుంబంలోనే తమ్ముడు పై అన్నకు, అన్న పై తమ్ముడుకు… ఆ ఇద్దరి పై తలిదండ్రులకు అసంతృప్తిలు ఉంటాయి. ప్రతి కొంపలో ఉండే కుంపటే ఇది. కానీ ఎన్ని గొడవులు ఉన్నా.. కోపాలు తగ్గాక అన్నీ సర్దుకుపోతాయి. కానీ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అనే కుటుంబంలో రగిలిన మంటలు రోజురోజుకు ఇంటినే తగలబెట్టేలా ఉన్నాయి. నిజానికి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి, అయినా బయట అందరూ కలసి మెలిసి ఉంటూ కనిపించారు.

కానీ మా ఎన్నికల తర్వాత పరిస్థితి దిగజారిందని స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు ఒకరి పై ఒకరు అనేక ఆరోపణలు చేసుకుంటున్నారు ? అసలు ఎక్కడ తేడా కొట్టింది ? ఈ ప్రశ్న పై ఇప్పుడు టాలీవుడ్ పెద్దలందరూ కాస్త సీరియస్ గా ఆలోచిస్తున్నారు. అయితే, ఆ ఆలోచనల తాలూకు చర్చల్లో తేలిన అంశం ఏమిటంటే.. తేడా కొట్టడానికి ముఖ్య కారణం నరేష్ అనే కలియుగ కృష్ణుడు.
అవును, ‘మా’ ఎన్నిలను ఒక మహాభారతంలా, ఆ బాగోతంలో తానూ ఒక కృష్ణుడిలా మొత్తానికి నరేష్ తనకు తానూ పెద్ద పోస్ట్ ఇచ్చుకుని, సగర్వంగా మీడియా ముందుకు వచ్చి ప్రపంచానికి చాటి చెప్పుకుని.. ‘మా’ ఎన్నికలను జరిపించాడు. మరి కృష్ణుడు అన్న తర్వాత, నలుగురిలో ఒక్కడిలా బిక్కుబిక్కుమంటూ ఉంటే ఏం బాగుంటుంది ? అందుకే, తన పాత్రకు న్యాయం చేయడానికి మంట పెట్టాడు.
అయితే, ఆ మంటలో భీష్మ పితామహుడులా ఎంట్రీ ఇచ్చి యుద్ధం ప్రకటించాడు మోహన్ బాబు. యుద్ధం ముగిసింది. అర్జునుడి పాత్ర పోషించిన మంచు విష్ణు అనే వ్యక్తి మోసం చేసి యుద్ధం గెలిచాడు అంటూ ఆరోపణలు మొదలయ్యాయి. మరి ఈ భారతం ఎప్పటికీ ముగుస్తోందో ? ఈ ఆరోపణలు ఎన్నటికీ శాంతిస్తాయో చూడాలి.
మొత్తానికి నరేష్ టాలీవుడ్‌ను చీల్చేందుకు తన వంతు పాత్రను పర్ఫెక్ట్ గా పోషించాడు. ‘మా’ ఎన్నికల నేపథ్యం మొదటి రోజు నుంచి అనేక వివాదాస్పద ప్రకటనలు చేస్తూ వచ్చాడు నరేష్. రెండు వర్గాలు కలిసిమెలిసి పోటీ చేసేలా కనిపిస్తున్న తరుణంలో ఆ వాతావరణం లేకుండా చేయడానికి కార్యవర్గ సభ్యుల మధ్య గొడవలు పెట్టాడు నరేష్.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ప్యానల్ కోర్టుకెళ్లే ఆలోచనలో ఉందనే ఉద్దేశ్యంతోనే మంచు విష్ణు చేత హడావుడిగా నరేష్ కావాలనే, పక్కాగా ప్లాన్ చేసే ప్రమాణస్వీకారం చేయించారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనికితోడు నరేష్, ప్రకాష్ రాజ్ ప్యానల్ పై ప్రకాష్ రాజ్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. చక్కగా మధ్యమధ్యలో నవ్వుతూ తన కృష్ణ పరమాత్మ పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. భీష్మ పితామహుడు మోహన్ బాబు పేరు ప్రఖ్యాతలు పరిస్థితేంటి అనేది ఇప్పుడు డౌట్ !