Balakrishna- Bigg Boss Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు బుల్లితెర పై ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు..ఈ షో ద్వారా ఎంతో మంది సెలెబ్రెటీలకు కొత్త జీవితం వచ్చింది..ప్రేక్షకులు ప్రతి ఏడాది ఈ సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు..ఇప్పటి వరుకు ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోకి ఆరవ సీజన్ నుండి మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది..మొదటి ఎపిసోడ్ నుండే దారుణమైన టీఆర్ఫీ రేటింగ్స్ రావడం..ఎలిమినేషన్స్ విషయం లో అన్యాయపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ సీజన్ పాలిట శాపం లాగా మారింది.

అందుకే 7 వ సీజన్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది బిగ్ బాస్ టీం..ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ ప్రేక్షకులకు బాగా ముఖ పరిచయం ఉన్నవాళ్లనే తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు..అంతే కాకుండా హోస్ట్ కూడా మారిపోబోతున్నాడు..సీజన్ 1 కి జూనియర్ ఎన్టీఆర్ , సీజన్ 2 నాని హోస్టులుగా వ్యవహరించగా సీజన్ 3 నుండి సీజన్ 6 వరకు అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించాడు.
వీటితో పాటు బిగ్ బాస్ OTT షో కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు..అన్ని సూపర్ హిట్ అయ్యాయి..ఒక్క సీజన్ 6 తప్ప..అందుకే సీజన్ 7 కి నందమూరి బాలకృష్ణ ని హోస్ట్ గా తీసుకోబోతున్నారు బిగ్ బాస్ టీం..ఇటీవలే బాలయ్య బాబు ని కలిసి ఆయనని ఒప్పించి అగ్రిమెంట్ కూడా తీసుకున్నట్టు సమాచారం..బాలయ్య బాబు ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో ద్వారా హోస్ట్ గా ఎంత సక్సెస్ అయ్యాడో అందరికి తెలిసిందే..తనలోని కొత్త యాంగిల్ ని పరిచయం చేసి శబాష్ అనిపించుకున్నాడు..యూత్ కి ఆయన ఎంతో చేరువ అయ్యాడు కూడా.

ఇప్పుడు అందుకే బిగ్ బాస్ రియాలిటీ షో కి ఆయనని హోస్ట్ గా తీసుకున్నట్టు సమాచారం..ఇందుకోసం ఆయనకీ 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారట..ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే అత్యధికం అని చెప్పొచ్చు..బాలయ్య బాబు హోస్ట్ అంటే కంటెస్టెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరిస్తారు..ఏమైనా తేడా చేస్తే బాలయ్య బాబు చేతిలో ‘దబిడి దిబిడే’..చూడాలి మరి బాలయ్య బాబు ఈ షో ఏ రేంజ్ కి తీసుకెళ్తాడో అనేది.