Balakrishna- Deva Brahmins: బాలకృష్ణలో తెలియని ఓ పొగరు నరనరాల్లో జీర్ణించుకుని ఉంది. ఎందులో అయినా మేమే గొప్ప అంటారాయన. ఎదుటివారి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గుర్తించలేరు. ఒప్పుకోలేరు. తాము మానవజాతికి అతీతులు. దైవాంశ సంభూతులని భావిస్తారు. ఈ గుణం బహుశా తండ్రి ఎన్టీఆర్ ద్వారానే వచ్చిందేమో. స్టార్ హీరోగా ఎదిగాక ఎన్టీఆర్ తన పక్కన ఎవరినీ కుర్చోనిచ్చేవాడు కాదట. ఈ లోకంలో తనకు సమానులు ఎవరూ లేరనే భావన వ్యక్తం చేసేవారట. ఆయన కూర్చొన్న చోట ఒక కుర్చీనే ఉంటుంది. మిగతావాళ్లు నిల్చొని మాట్లాడాలి. ఇక బాలయ్య మా నాన్న కారణజన్ముడు అంటారు.

భూమి మీద నడయాడిన మహామాత్ముడని కొనియాడుతారు. సందర్భంతో సంబంధం లేకుండా ”ఆ రోజుల్లో నాన్నగారు” అంటూ ఎత్తుకుంటాడు. దశాబ్దాలుగా ఈ డైలాగ్ విని జనాలు విసిగిపోయారు. ఒక కారణజన్ముడికి పుట్టిన బిడ్డలు కూడా కారణజన్ములే కదా… అదే ట్రాన్స్ లో బాలయ్య ఉంటాడు. ఆధునిక సమాజంలో బ్రతుకుతూ ‘మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు’ అని చెప్పిన ఘనుడు బాలయ్య. అది తాను పుట్టిన కులం గొప్పదని చెప్పకనే చెప్పడం. మా జాతి మిగతావాళ్ల కంటే గొప్పదన్న అహం… బాలయ్య ప్రతి మాటలో కనిపిస్తుంది.
అలాంటి బాలయ్య ఇన్నేళ్ల కెరీర్లో ఒకరిని క్షమాపణలు అడిగింది లేదు. ఏదైనా మా నోటి నుండి వచ్చింది కాబట్టి అది కరెక్ట్. కాదని ఎవరైనా విమర్శించినా పట్టించుకోము. సంజాయిషీ ఇచ్చుకోమన్నట్లు బాలయ్య ఉంటాడు. ‘అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలి’ అని పబ్లిక్ గా చెప్పిన బాలయ్యపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు కూడా బాలయ్య వెనక్కి తగ్గింది. నిరసనలు చేసినవాళ్లు నోళ్లు నొప్పెట్టి కొంతకాలానికి ఆగిపోయారు. బాలయ్య మాత్రం తన మాటలు వెనక్కి తీసుకుంది లేదు. అనూహ్యంగా బాలయ్య ఓ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాడు. అది కూడా బాగా తగ్గి వారిని వేడుకున్నాడు.

దేవబ్రాహ్మణుల నాయకుడు రావణాసురుడు అని బాలయ్య అన్నారు. దీన్ని ఆ సామాజిక వర్గం తప్పుబట్టింది. దేవర బ్రాహ్మణుల చరిత్ర తెలియకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తారు. నాది తప్పైపోయింది అలవాటులో పొరపాటుగా వచ్చేసింది. కావాలని చేసిన పని కాదంటూ బాలయ్య ఓ సుదీర్థ పశ్చాత్తాప సందేశం విడుదల చేశాడు. కారణజన్ముడు కుమారుడు ఇలా ఓ బీసీ సామాజిక వర్గానికి వినమ్రంగా క్షమాపణలు చెప్పడం కొత్తగా ఉంది. ఓటు బ్యాంకు సమీకరణాలలో భాగంగానే బావ చంద్రబాబు ఆదేశం మేరకు బాలయ్య తగ్గాడనే వాదన వినిపిస్తోంది.