Ramya Raghupathi- Naresh: నటుడు నరేష్ పై రమ్య రఘుపతి ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఆమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నారు. తాజాగా రమ్య రఘుపతి ఓ మీడియా ఛానల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా నరేష్ క్యారెక్టర్ ని ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు. నరేష్ పెద్ద ఉమనైజర్, అతనికి అమ్మాయిల పిచ్చి ఉంది. పలుమార్లు దొరికిపోయాడు. ఇల్లీగల్ ఎఫైర్ లో పట్టుబడినప్పుడు నరేష్ నా కాళ్ళు పట్టుకొని వేడుకునేవాడు. అక్రమ సంబంధం బయటపడిన రెండు నెలల వరకు మంచి హస్బెండ్ గా ఉంటాడు. సారీ చెప్పడం బ్రతిమిలాడుకోవడం చేస్తాడు.

తల్లి విజయనిర్మల చనిపోయాక అతని ఆగడాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఆయన విచ్చలవిడి వ్యవహారాలను ప్రశ్నించేవారు లేకుండా పోయారు. విజయనిర్మల ఉన్నప్పుడు కొంచెం భయపడేవాడు. పవిత్ర లోకేష్ కి దగ్గర కావడానికి, ఎఫైర్ పెట్టుకోవడానికి ఈ పరిస్థితులు దారితీశాయంటూ రమ్య రఘుపతి వెల్లడించారు. మరి ఇంత చెడ్డవాడైనప్పటికీ నరేష్ ని కోరుకోవడానికి ఒకే ఒక రీజన్… నేను భార్యను కాబట్టి. అలాగే నా కొడుకు కోసం అన్నారు.
కాగా రమ్య రఘుపతి ఇటీవల నరేష్ ని ఉద్దేశిస్తూ మరికొన్ని విమర్శలు చేశారు. నరేష్ నన్ను వదిలించుకోవడానికి దారుణాలకు పాల్పడ్డాడు. ఎఫైర్స్ అంటగట్టారు. చివరికి దేవుడు లాంటి కృష్ణతో నాకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. కృష్ణ నాపై కంప్లైంట్ చేస్తున్నట్లు లెటర్ రాసి, ఆయన సంతకం ఫోర్జరీ చేశాడు. దాని ఆధారంగా నామీద కేసు పెట్టారు. ఆ విషయం కృష్ణగారికి కూడా తెలియదన్నారు.

నరేష్ నా కొడుకు ముందే పోర్న్ వీడియోలు చూసేవాడు. డాడీ డర్టీ వీడియోలు చూస్తున్నాడని పలుమార్లు మా అబ్బాయి నాతో చెప్పాడంటూ ఇలా పలు సీరియస్ అలిగేషన్స్ చేశారు. అదే సమయంలో నరేష్ కి విడాకులు ఇచ్చేది లేదని ఆమె కుండబద్దలు కొడుతున్నారు. పవిత్ర-నరేష్ ల వివాహం జరిగనివ్వను. నాకు విడాకులు ఇవ్వకుండా వారు పెళ్లి చేసుకున్నా అది చెల్లదని ఆమె అంటున్నారు. కొన్నాళ్లుగా నరేష్-పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారు. రెండు వారాల క్రితం వివాహం చేసుకోబోతున్నట్లు నరేష్ ప్రకటించారు. ఇక రమ్య రఘుపతి ఇన్ని ఆరోపణలు చేస్తున్నా… నరేష్ స్పందించకపోవడం విశేషం. ఇంతవరకు రమ్య కామెంట్స్ ని ఆయన ఖండించలేదు.