https://oktelugu.com/

Balagam Movie Review: ‘బలగం’ మూవీ ఫుల్ రివ్యూ

Balagam Movie Review: నటీనటులు : ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ , వేణు టిల్లు, రచ్చ రవి, సుధాకర్ రెడ్డి, జయరాం , మురళీ ధర్ తదితరులు బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి డైరెక్టర్ : వేణు టిల్లు మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్ తెలంగాణ ప్రాంత నేపథ్యం లో మన టాలీవుడ్ లో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి.ముఖ్యంగా తెలంగాణ పల్లెటూర్లలో జనాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2023 / 09:44 AM IST
    Follow us on

    Balagam Movie Review

    Balagam Movie Review: నటీనటులు : ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ , వేణు టిల్లు, రచ్చ రవి, సుధాకర్ రెడ్డి, జయరాం , మురళీ ధర్ తదితరులు

    బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్
    నిర్మాతలు : హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి
    డైరెక్టర్ : వేణు టిల్లు
    మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్

    తెలంగాణ ప్రాంత నేపథ్యం లో మన టాలీవుడ్ లో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి.ముఖ్యంగా తెలంగాణ పల్లెటూర్లలో జనాలు ఆచరించే ఆచారాలు, కట్టుబాట్లు మరియు సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ఇప్పటి వరకు ఎవ్వరూ సినిమాలు తియ్యలేదు.ఒకప్పుడు తెలంగాణ యాసని కామెడీ కోసం ఉపయోగించే వాళ్ళు.అక్కడి ప్రజలు ఈ విషయంపై అప్పట్లో నిరసన కూడా చేసేవారు.కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ యాస సక్సెస్ మంత్రం అయిపోయింది.స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు కూడా తెలంగాణ యాసని సినిమాల్లో ఉపయోగిస్తున్నారు.అలా సంపూర్ణ తెలంగాణ నేపథ్యం లో సాగే సినిమా నేడు విడుదలైన ‘బలగం’.ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా పై మొదటి నుండి ప్రేక్షకుల్లో ఎదో కొత్త తరహా సినిమాని చూడబోతున్న ఫీలింగ్ ని తీసుకొచ్చింది.ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం తో సినిమా పై మరింత అంచనాలను పెంచాయి.మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

    కథ :

    కొమురయ్య తాత(సుధాకర్ రెడ్డి) ఊర్లో అందరితో ఎంతో స్నేహంగా ఉంటాడు,దారిన పోతున్న ప్రతీ ఒక్కరితో సరదాగా మాట్లాడుతూ, ఆటపట్టిస్తూ ఉంటాడు.అలా ఎల్లప్పుడూ సరదాగా ఉండే కొమురయ్య ఎదో తెలియని దిగులుతో ఒక రోజు చనిపోతాడు.ఈ విషయం తెలుసుకున్న మానవుడు సాయిలు (ప్రియదర్శి) కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపడినంత పని అవుతుంది.ఎందుకంటే ఆయన ఊర్లో ఉన్న పొలాన్ని అమ్మేసి చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటాడు.అంతే కాదు రకరకాల వ్యాపారాలను చేసి డబ్బు మొత్తాన్ని పోగొట్టుకొని లక్షల్లో అప్పు చేసి ఉంటాడు.అప్పులోళ్ల బాదంని భరించలేక సాయిలు 15 లక్షల రూపాయిలు కట్నం ఇచ్చే పిల్లని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతాడు.రెండు రోజుల్లో నిశ్చితార్థం జరుగుతుంది అనగా ఇలా తాత చనిపోయాడు అనే వార్త తన పెళ్లి ప్లాన్ మొత్తాన్ని రివర్స్ చేస్తుంది.తాత చనిపొయ్యాడనే భాద కంటే అప్పులు ఎలా కట్టాలి అనే బాధ సాయిలు ని వెంటాడుతుంది .అదే సమయం లో సాయిలు తండ్రి జయరాం కి మరియు మామయ్య మురళీధర్ కి మధ్య గొడవలున్నాయి అనే విషయం తెలుస్తుంది.అలా ఆ సంబంధం చెడిపోవడం తో తన ఇంటికి వచ్చిన మరదల్ని చూసి ఆమెని ప్రేమలో దింపి పెళ్లి చేసుకొని ఎలా అయినా తన అప్పులు మొత్తం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాయిలు.మరి సాయిలు ప్లాన్ వర్కౌట్ అయ్యిందా లేదా అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

    విశ్లేషణ :

    పూర్తి స్థాయి తెలంగాణ నేపథ్యం లో సినిమా తియ్యడం అంటే సాధారణమైన విషయం కాదు, చాలా కష్టం.ఎందుకంటే ఆ బాషా లోతుల్లోకి వెళ్తే చాలా మందికి అర్థం కాదు.అందుకే తెలంగాణ భాషని సినిమాల్లో ఒక పరిమితి మేరకు మాత్రమే వాడుతారు కానీ, ఎక్కువగా ఉపయోగించరు.కానీ ఈ సినిమాలో అడుగడుగునా తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ఎంతో అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు వేణు.జబర్దస్త్ కమెడియన్ గా కోట్లాది మంది తెలుగు ప్రజలకు సుపరిచితమైన వేణు లో ఇంత దర్శకత్వ ప్రతిభ దాగుందా అని అందరూ ఆశ్చర్యపొయ్యేలా దర్శకత్వం వహించాడు.తెలంగాణ పల్లెటూరు చుట్టూ సాగే ఈ కథలో ఎమోషన్స్ మరియు ఫన్ రెండు బ్యాలన్స్ తప్పకుండా చాలా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.ముఖ్యంగా తాత చనిపోయినప్పుడు సాయిలు (ప్రియదర్శి) లో బాధకంటే ఎక్కువగా, అప్పులు ఎలా కట్టాలి,తన పెళ్లి చెడిపోయిందనే ఫ్రూస్ట్రేషన్, మరియు అక్కడికి వచ్చిన మరదల్ని పడేసి పెళ్లి చేసుకోవాలనే తాపత్రయం లో పుట్టిన ఫన్ , ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.

    అదే సమయం లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి.ఇక నటీనటుల నటన విషయానికి వస్తే ప్రియదర్శి కి ఇలాంటి పాత్రలు చెయ్యడం అనేది వెన్నతో పెట్టిన విద్య.గతం లో ఆయన తెలంగాణ నేపథ్యం లో వచ్చిన ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలు చేసాడు.ముఖ్యంగా తెలంగాణ నేపథ్యం లో వచ్చిన మల్లేశం అనే సినిమా అతనికి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా కూడా ఆయనకీ అదే రేంజ్ క్రేజ్ ని తెస్తుంది అని చెప్పొచ్చు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన కావ్య కళ్యాణ్ రామ్ కూడా ఎంతో చక్కగా నటించింది.ఇక మామగా చేసిన మురళీధర్ మరియు తండ్రి గా చేసిన జయరాం సినిమాకి ప్రాణం పోశారనే చెప్పాలి.నటీనటులుగా ప్రతీ ఒక్కరు ఈ సినిమాలో జీవించేసారు.

    Balagam Movie Review

    చివరి మాట :

    పల్లెటూరు వాతావరణం లో జరిగే ఈ కథ ప్రతీ తెలంగాణ ప్రేక్షకుడి మనసుల్ని కదిలిస్తుంది.ఒక రెండు గంటల పాటు మనం కూడా ఆ పల్లెటూరులోకి అడుగుపెట్టి అక్కడి వాతావరణం లో తిరుగుతున్నా అనుభూతి కలుగుతుంది.కొత్తతరహా సినిమాలను చూడడానికి ఇష్టపడే ప్రతీ ఒక్కరు తప్పకుండ చూడాల్సిందే సినిమా ఇది.కాస్త స్లో గా ఉన్నప్పటికీ కూడా ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యే చిత్రం గా ఈ వీకెండ్ బలగం తో కాలక్షేపం చెయ్యొచ్చు.

    Tags