
Balagam Remake: ఇటీవల కాలం లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘బలగం’.ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా లో ప్రియదర్శి హీరో గా నటించగా,కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది.ప్రముఖ నిర్మాత దిల్ రాజు కోటి రూపాయిల కంటే తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు.
తెలంగాణ గ్రామీణ సంప్రదాయాన్ని, సంస్కృతిని ఉట్టిపడేట్టు వెండితెర మీద ఎంతో అద్భుతంగా ఆవిష్కరించాడు డైరెక్టర్ వేణు.కేవలం 50 లక్షల రూపాయిల ఖర్చు తో తీసిన ఈ చిత్రం 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి 10 కోట్ల రూపాయిల గ్రాస్ దిశగా అడుగులు వేస్తుంది.పెట్టిన బడ్జెట్ కి పది రేట్లు లాభం రావడం అనేది సాధారణమైన విషయం కాదు, ఇలాంటి అద్భుతాలు ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి.
అయితే టాలీవుడ్ లో ఇంత బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రాన్ని తమిళం లో ఒక స్టార్ హీరో తో చెయ్యడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడట.ఇలాంటి పాత్రలకు కేవలం ధనుష్ మాత్రమే న్యాయం చేస్తాడని దిల్ రాజు బలంగా నమ్ముతున్నాడట.త్వరలోనే ఆయన చెన్నై కి వెళ్లి ఈ కథని ధనుష్ కి వినిపించబోతున్నాడట.ఈ సినిమాకి కూడా డైరెక్టర్ గా వేణు నే వ్యవహరిస్తాడట.అయితే ఇక్కడ ఎలా అయితే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వెండితెర మీద ఆవిష్కరించాడు, కానీ తమిళ వెర్షన్ లో అక్కడి సంస్కృతి ని చాటిచెప్తూ స్క్రిప్ట్ లో పలు కీలకమైన మార్పులు చేస్తున్నారట.

ఇలాంటి సినిమాలు తమిళనాడు లో ప్రభంజనం సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి..పైగా ధనుష్ లాంటి స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్ లో ఒకటి అవుతున్నాడు అంటే కచ్చితంగా వేరే లెవెల్ ఫలితాన్ని ఆశించవచ్చు అంటున్నారు విశ్లేషకులు.ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.