https://oktelugu.com/

Balagam- Dasara: బలగం, దసరా.. ఏం చూపిస్తున్నారు? తెలంగాణవాళ్లు తాగుబోతులా?

Balagam- Dasara: ‘కోటి రతనాల వీణ.. నా తెలంగాణ..’అని ప్రముఖ కవి కాళోజి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నేటి వారు చెబుతూ ఉంటారు. ఎన్నో ఉద్యమాలకు, పోరాటాలకు పురిటి గడ్డగా తెలంగాణ పేరు చెబుతారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ తెలంగాణ గురించి ప్రపంచమంతా చర్చించుకుంది. అంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణను సినిమాల్లో మాత్రం ఛీప్ గా చూపిస్తున్నారన్న చర్చ మొదలైంది. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ యాసతో విలన్ లుగా, కమెడీయన్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 6, 2023 / 12:35 PM IST
    Follow us on

    Balagam- Dasara

    Balagam- Dasara: ‘కోటి రతనాల వీణ.. నా తెలంగాణ..’అని ప్రముఖ కవి కాళోజి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నేటి వారు చెబుతూ ఉంటారు. ఎన్నో ఉద్యమాలకు, పోరాటాలకు పురిటి గడ్డగా తెలంగాణ పేరు చెబుతారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ తెలంగాణ గురించి ప్రపంచమంతా చర్చించుకుంది. అంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణను సినిమాల్లో మాత్రం ఛీప్ గా చూపిస్తున్నారన్న చర్చ మొదలైంది. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ యాసతో విలన్ లుగా, కమెడీయన్ లుగా చూపించారే తప్ప గౌరవం ఇవ్వడం లేదని అంటున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత ఇండస్ట్రీలో మార్పు వచ్చిందని కొందమంది కొనియాడారు. కానీ ఇటీవల రిలీజైన ‘బలగం’, ‘దసరా’ సినిమాల్లో తెలంగాణ అంటే తాగుబోతుల రాజ్యం అన్నట్లు చిత్రీకరించారన్న విమర్శలు వస్తున్నాయి.

    2023 మార్చి నెలలో రిలీజైన ‘బలగం’ ‘దసరా’ సినిమాలో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ సినిమాలో నటించిన, తీసిన వారికి ప్రత్యేక అభినందనలు అందుతున్నాయి. బలగం సినిమానూ ఊరూరా ప్రొజెక్టర్ల ద్వారా రన్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లి అవార్డులను కూడా అందుకుంటోంది. ఇటు దసరా మూవీ ఇండస్ట్రీ రికార్డు తిరగేస్తుంది. అనతి కాలంలోనే వసూళ్లను కొల్లగొట్టింది. ఈ సినిమాలో నటించిన వారితో పాటు తెలంగాణకు చెందిన డైరెక్టర్ శ్రీకాంత్ కు అన్ని వైపులా ప్రశంసలు దక్కుతున్నాయి.

    ఇదే సమయంలో సినిమాలో తెలంగాణ ప్రాంతంలోని ఆచార, వ్యవహారాలను చూపించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో మద్యం గురించి ఎక్కువగా పెట్టారు. బలగం సినిమాల్లో అత్తారింటికి వచ్చిన అల్లుడికి ముక్క, చుక్క లేదన్న కోపంతో బంధాలే తెంపుకుంటారని చూపించారు. అటు దసరా సినిమాలో చిన్న పిల్లల నుంచి ముసలోళ్ల వరకు అందరూ తాగుబోతులుగానే చిత్రీకరించారు ఇక హీరో నాని అయితే బాటిల్ ను నోట్లో పెట్టుకున్న పోస్టర్లు కలకలం రేపాయి. అంతేకాకుండా మా తెలంగాణలో మద్యం తాగడం ఆచారం అంటూ హైలెట్ చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది.

    ఆంధ్రప్రాంతం అనగానే గోదావరి పైరు, బంధాలు, అందమైన ప్రదేశాలు అని చూపిస్తారు. కానీ తెలంగాణ ప్రాంతానికొచ్చేసరికి మాత్రం రౌడీయిజాన్ని ఎక్కువగా చూపిస్తున్నారని అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాకముందు వచ్చిన సినిమాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి కమెడియన్ గానో.. లేక విలన్ గానో మాత్రమే చూపిస్తూ వివక్ష చూపారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ గొప్పతనం తెలిసి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా సినిమాల్లో అదే వివక్ష కొనసాగుతుందని అంటున్నారు.

    Balagam- Dasara

    దసరా సినిమా తీసిన డైరెక్టర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారైనా తెలంగాణ వాదులంతా తాగుబోతుల్లా చూపించాలా? అని అంటున్నారు. అటు బలగం సినిమాకు ప్రతీ ఊర్లో బ్రహ్మరథం పడుతున్నారు. కానీ ఒక నల్లి బొక్క కోసం తెలంగాణ వాళ్లు బంధాలను తెంపుకుంటారని చెప్పడం బాగోలేదని అంటున్నారు. ఇప్పటికైనా తెలంగాణ గొప్పదనం గురించి చెబుతూ సినిమాలు తీయాలని కోరుతున్నారు.