Shriya Saran: శ్రియ శరన్ ఇరవై ఏళ్లకు పైగా పరిశ్రమను ఏలుతున్నారు. సౌత్ టు నార్త్ అన్ని పరిశ్రమలను దున్నేశారు. స్టార్ గా రిటైర్ అయినా అడపాదడపా చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు. గత ఏడాది ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ చిత్రంలో తళుక్కున మెరిసింది. అజయ్ దేవ్ గణ్ భార్యగా చిన్న పాత్ర చేశారు. మరలా దృశ్యం 2(హిందీ)లో ఆయనకు జంటగా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేశారు. ఇక కన్నడ పరిశ్రమలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ కబ్జ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఈ జనరేషన్ లో ఇంతటి సుదీర్ఘమైన కెరీర్ అనుభవించిన హీరోయిన్స్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 2001లో విడుదలైన ‘ఇష్టం’ శ్రియ మొదటి చిత్రం. అనంతరం సంతోషం చిత్రంతో సూపర్ హిట్ కొట్టింది. నెక్స్ట్ చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే, ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్స్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అక్కడ నుండి శ్రియ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు.
రెండు తరాల టాప్ స్టార్స్ ని కవర్ చేసిన ఘనత శ్రియ సొంతం. కెరీర్ నెమ్మదిస్తున్న తరుణంలో పర్సనల్ లైఫ్ ప్లాన్ చేసుకుంది. రష్యన్ ప్రియుడు ఆండ్రీని 2018లో శ్రియ వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి. పాప పేరు రాధ. తల్లైన విషయాన్ని శ్రియ దాచిపెట్టింది. 2020 లాక్ డౌన్ సమయంలో తెలివిగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసింది. దాంతో శ్రియ గర్భవతి అయిన విషయం ఎవరికీ తెలియదు.
అనంతరం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. దాంతో అందరూ షాక్ అయ్యారు. కొన్ని విమర్శలకు భయపడి గర్భం దాల్చిన విషయం బయటపెట్టినట్లు శ్రియ ఇటీవల వెల్లడించారు. శ్రియతో పాటు ఆండ్రీ ఇండియాలోనే ఉంటున్నట్లు సమాచారం. అన్యోన్య దంపతులుగా వీరు మెలుగుతున్నారు.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా శ్రియ సంచలన ఫోటోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ఆమె చేసిన పని నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేసింది. నా ఫేవరేట్ ఫోటో అంటూ… దుస్తులు లేకుండా ఉన్న న్యూడ్ ఫోటో షేర్ చేసింది. అయితే లో ప్రొఫైల్ రివీల్ చేయకపోవడంతో జనాలు బ్రతికిపోయారు. లేదంటే కుర్రాళ్ళ గుండెల్లో సునామీ వచ్చేది. శ్రియ న్యూడ్ ఫోటో వైరల్ అవుతుంది. శ్రియ తరచుగా ఈ తరహా ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెడుతుంటారు.