Avatar 2 First Reviews Out: 2009వ సంవత్సరంలో విడుదలైన హాలీవుడ్ చిత్రం అవతార్ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మాటల్లో చెప్పలేము..ఆరోజుల్లోనే ఈ చిత్రానికి 2 బిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి.. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది..’ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ వచ్చేంత వరకు అవతార్ రికార్డ్స్ ని ముట్టుకున్న హాలీవుడ్ చిత్రం ఒక్కటి కూడా లేదు..అంతటి ప్రభంజనం సృష్టించిన సినిమా అది..ఆ తర్వాత అవతార్ పార్ట్ 2 ని తియ్యడానికి ఏకంగా 11 ఏళ్ళ సమయం తీసుకున్నాడు జేమ్స్ కామెరూన్.

మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది.. 2D,3D,ఐమాక్స్ ఫార్మట్స్ తో పాటుగా 4DX ఫార్మాట్ లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతోంది.. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కి ప్రముఖ నటుడు, దర్శకుడు , రచయత అయినా అవసరాల శ్రీనివాస్ మాటలు అందించాడు అనే న్యూస్ రావడం తో ఈ మూవీ పై తెలుగు లో మరింత బజ్ ఏర్పడింది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని సెలెక్టివ్ ప్రాంతాలలో ప్రదర్శించారు.. ఈ షోస్ కి అందరూ ఊహించినట్టుగానే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ ఈ సినిమా మొత్తాన్ని ఎమోషన్స్ తో నింపేసాడట.. చూసే ప్రేక్షకులకు పండోర గ్రహంలోకి అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తూనే, సినిమాలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయట.

మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సినిమా అంచనాలను మించి ప్రభంజనం సృష్టించాలంటే కచ్చితంగా ఎమోషన్స్ అన్నీ బాగా పండాలి.. ఉదాహరణకి బాహుబలి 2 తీసుకోవచ్చు..డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాలో ఎమోషన్స్ తో పేకాట ఆడేసాడు.. అందుకే ఆ చిత్రం 2000 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది.. అవతార్ 2 చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తే మన ఇండియన్ భాషల నుండే 2000 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది.. ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి మరో పదేళ్ల పాటు ముట్టుకోలేని రికార్డ్స్ ని పెట్టబోతున్నాడు జేమ్స్ కేమోరూన్.