https://oktelugu.com/

Avatar 2 into OTT : OTT లోకి అవతార్ 2..సరికొత్త టెక్నాలజీతో టీవీ లో కూడా థ్రిల్లింగ్ అనుభూతి!

Avatar 2 into OTT : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అవతార్ 2 గత ఏడాది చివర్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇండియా లో ఈ సినిమా రన్ అయిపోయినప్పటికీ, అమెరికా మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.ఇప్పటి వరకు విడుదలైన అన్ని భాషలకు కలిపి ఈ సినిమా సుమారుగా 18000 కోట్ల రూపాయలకు పైగా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2023 / 09:02 PM IST
    Follow us on

    Avatar 2 into OTT : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అవతార్ 2 గత ఏడాది చివర్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇండియా లో ఈ సినిమా రన్ అయిపోయినప్పటికీ, అమెరికా మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.ఇప్పటి వరకు విడుదలైన అన్ని భాషలకు కలిపి ఈ సినిమా సుమారుగా 18000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిందని తెలుస్తుంది.

    హాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ సినిమాకి ఏడాది పాటు థియేట్రికల్ రన్ ఉంటుందట.అంటే ఫుల్ రన్ లో మూడు బిలియన్ డాలర్లు వసూలు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఈనెల 28 వ తారీఖు నుండి ఓటీటీ లో అందుబాటులోకి రానుంది.ఈ సినిమా తెలుగు , హిందీ , ఇంగ్లీష్ , మలయాళం మరియు కన్నడ భాషలకు కలిపి భారీ మొత్తాన్ని వెచ్చించి డిస్నీ + హాట్ స్టార్ కొనుగోలు చేసింది.

    అయితే ఇప్పుడు ‘అవతార్ 2’ తో పాటుగా, ఆ సినిమాకి సంబంధించిన అదనపు మూడు గంటల సినిమా కూడా అందుబాటులోకి రాబోతుందట.అయితే ఈ అదనపు మూడు గంటల సినిమాని చూడడానికి అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.టీవీ లో చూసే వాళ్లకి కూడా అద్భుతమైన అనుభూతిని కలిగించే విధంగా ఈ అదనపు మూడు గంటల సినిమా ఉండబోతుందట.

    ఇది డిస్నీ + హాట్ స్టార్ తో పాటుగా, అమెజాన్ ప్రైమ్ లో కూడా రెంట్ రూపం లో ఉంటుంది.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియచేయనున్నారు.జేమ్స్ కెమరూన్ ఐడియా వర్కౌట్ అయ్యి ఈ అదనపు మూడు గంటల సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తే ఓటీటీ ద్వారా కూడా ఈ సినిమాకి కాసుల కనకవర్షం కురిసినట్టే.చూడాలి మరి ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి అద్భుతాలకు కేంద్ర బిందువుగా మారబోతుందో అనేది.