https://oktelugu.com/

Satvik Case : ఒక ఇంటర్ విద్యార్థి చావు.. ప్రభుత్వం కళ్లు తెరిపించిందిలా.. ఇక ఈ రూల్..

Satvik Suicide Case Satvik Case : మొన్న హైదరాబాదులోని శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఖమ్మంలో అదే శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని కాలేజీ గోడపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇవి వెలుగులోకి వచ్చినవే.. రానివి కోకొల్లలు. పైగా విద్యార్థులపై వేధింపులు నానాటికి పెరుగుతున్నాయి.. దీనివల్ల విద్యార్థుల్లో ఆత్మ న్యూనత పెరుగుతోంది. ఫలితంగా వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి తోడు యాజమాన్యాలు కూడా తమ దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నాయి.ఈ […]

Written By:
  • Rocky
  • , Updated On : March 8, 2023 / 09:00 PM IST
    Follow us on

    Satvik Suicide Case

    Satvik Case : మొన్న హైదరాబాదులోని శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఖమ్మంలో అదే శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని కాలేజీ గోడపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇవి వెలుగులోకి వచ్చినవే.. రానివి కోకొల్లలు. పైగా విద్యార్థులపై వేధింపులు నానాటికి పెరుగుతున్నాయి.. దీనివల్ల విద్యార్థుల్లో ఆత్మ న్యూనత పెరుగుతోంది. ఫలితంగా వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి తోడు యాజమాన్యాలు కూడా తమ దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నాయి.ఈ క్రమంలో వీటిని నివారించేందుకు సర్కారు కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది.

    ఇంటర్మీడియట్‌ విద్యార్థులను వేధించినట్టు రుజువైతే, సదరు కాలేజీలను శాశ్వతంగా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులను వేధించిన కారణంగా రాష్ట్రంలో ఇంతవరకు కాలేజీల శాశ్వత రద్దు జరగలేదు. ఇకపై ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాల్‌, సిబ్బంది వంటి వారి వేధింపులను తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల నార్సింగిలోని కాలేజీల్లో కూడా ఇదే జరిగింది. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఏడాదికి సదరు కాలేజి గుర్తింపును రద్దు చేస్తున్నట్ట ప్రకటించారు. ఈ రద్దు ఒక్క ఏడాదికే పరిమితం కాకుండా శాశ్వతంగా ఉండాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఇదే విధానాన్ని వర్తింపజేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

    ఇంటర్ బోర్డుతో సంబంధం లేకుండా..

    ఇంటర్మీడియట్‌ బోర్డు షెడ్యూల్‌తో సంబంధం లేకుండా పలు జూనియర్‌ కాలేజీలు ముందుగానే విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఇలాంటి విపరీత పరిణామాలను అరికట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇందులో అధికార పార్టీ నేతలకు సంబంధించిన కాలేజీలు ఉండటంతో చర్యలకు వెనుకాడుతున్నారు. అయితే ఇలాంటి వాటి విషయంలో వెనకాడకూడదని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.. అయితే ఈ క్రమంలో అధికారులు సమావేశం నిర్వహించి ఒక నిబంధనావళిని రూపొందించినట్టు సమాచారం. అయితే దీనికి ముఖ్య మంత్రి ఆమోదముద్ర వేయకున్నప్పటికీ.. ఇది అమల్లోకి వస్తుందని ఇంటర్ అధికారులు చెబుతున్నారు. ఇక ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ నెంబర్ వన్ ర్యాంక్ స్థానంలో ఉండడంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. అదేవిధంగా ఇంటర్ మూల్యాంకనం సమయంలో ఇష్టానుసారంగా వ్యవహరించే అధ్యాపకులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2020లో ఇంటర్ మూల్యాంకన సమయంలో చాలామందికి మార్కుడు తక్కువ రావడంతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. అయితే ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.