
Solar Fan: భానుడు భగభగమంటున్నాడు. ఎండ తాకిడికి ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావడం లేదు. అత్యవసర పరిస్థితులయితే తప్ప బయటికి రాకండి అంటూ వాతావరణ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా పని కోసం బయటకు వెళ్లాలంటే కుత కుత గా ఉడకాల్సి వస్తోంది. ఇక వాహనాలపై వెళ్లే వారి పరిస్థితి మరి దారుణం. ఓ వైపు వేడి.. మరోవైపు వేడిగాలితో వడదెబ్బ బారిన పడుతున్నారు. అయితే ఏసీ కార్లలోవెళ్లేవారికి కాస్త ఉపశమనం కలిగించినా.. మళ్లీ బయటకొస్తే ఎండవేడికి తట్టుకోలేకపోతున్నారు. అసలు విషయమేంటంటే ఇప్పుడున్న పాత కార్లలో చాలా వరకు ఏసీలు లేవు. దీంతో వీరు ప్రయాణించేటప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే తక్కువ బడ్జెట్ లో ఏసీ అవసరం లేకుండా కారును కూల్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
ఎండ ఎంత ఉన్నా ఏసీ కారులో ప్రయాణించడం పెద్ద సమస్య కాదు. కానీ వితౌట్ ఏసీ కార్లలో అవస్థలు పడాల్సి వస్తోంది. దీంతో ఏసీ లేని కారణంగా చాలా మంది పాత కార్లను అమ్మేసీ కొత్త కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఏసీ అవసరం లేకుండా కారును కూల్ చేయొచ్చు. దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం రూ.350 తో ఓ పరికరం కొనుగోలు చేసి దానిని కారులో అమర్చుకోవడం ద్వారా కారు కూల్ అయిపోతుంది.
సోలార్ ప్లేట్ తో ఇమిడి ఉన్న ఈ పరికరం చిన్న ఫ్యాన్ లాగా ఉంటుంది. దీనిని కారు కిటికీ పై ఉంచాలి. ఇది కారు లోపల ఉన్న వేడిని బయటకు తీసేస్తుంది. దీంతో కారు చల్లబడుతుంది. ఒకవేళ ఏసీ కార్లు ఉన్నవారు సైతం దాని అవసరం లేకుండా ఈ ఫ్యాన్ ద్వారా కారును చల్లబర్చవచ్చు. ఈ సోలార్ ఫ్యాన్ ను చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. దీనిపై సోలార్ ప్లేట్ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా రీచార్జ్ చేసుకుంటుంది. అందువల్ల ఎటువంటి ఎక్కువ బడ్జెట్ లేకుండా కారును చల్లగా ఉంచుకోవచ్చు.

ఈ పరికరం ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తోంది. అయితే షోరూంలో కంటేఆన్లైన్లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. రూ.350 నుంచి రూ.3,500 వరకు దీనిని విక్రయిస్తున్నారు. కారు మోడల్ ను లేదా అవసరాలను భట్టి వీలైనంత బడ్జెట్ ను కేటాయించుకోవచ్చు. దీని గురించి తెలిసిన వారు కొనుగోలు చేసుందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి మీకు అవసరం ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి..