Husband And Wife: ఆసక్తికర పరిశోధన : భార్యల చేతుల్లో చావుదెబ్బలు తింటున్న భర్తలు తెలంగాణలోనే ఎక్కువట

ఒకప్పుడు భార్యలపై భర్తలు డామినేషన్‌ చేసేవారు. చిన్న చిన్న కారణాలతో చితకబాదేవారు. భార్యలు సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి..

Written By: Raj Shekar, Updated On : March 1, 2024 12:30 pm
Follow us on

Husband And Wife: సంసారం అన్నాకా చిన్నచిన్న గొడవలు సహజం. గిల్లికజ్జాలు, కోపతాపాలు, అలకలు, బుజ్జగింపులు ఉన్న సంసారమే సాఫీగా సాగిపోతోంది. ఇవి లేని కాపురం చప్పగా ఉంటుంది. అన్నీ సర్దుకుపోతే సంపార నావ హాయిగా సాగుతోంది. అయితే ఈ రోజుల్లో చిన్నచిన్న మనస్పర్థలకే కాపురాలు కూల్చుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా భార్య, భర్తలు గొడవలు పడుతున్నారు. పోలీస్‌ స్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలా విడిపోతున్నవారు పెరుగుతున్నారు.

భార్యల డామినేషన్‌..
ఇక కొందరు భర్తలు గొడవలు జరిగితే సర్దుకుపోతున్నారు. చిన్నచిన్న గొడవల విషయంలో కాంప్రమైజ్‌ అవుతున్నారు అయితే భార్యలు మాత్రం అలా కావడం లేదు. డామినేషన్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. భర్తను ఓ పట్టు పట్టాల్సిందే అన్నట్లుగా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కొందరు భర్తలు అయితే భార్యల చేతుల్లో దెబ్బలు కూడా తింటున్నారు.

సాధరణంగా మారిన కొట్లాట..
ఒకప్పుడు భార్యలపై భర్తలు డామినేషన్‌ చేసేవారు. చిన్న చిన్న కారణాలతో చితకబాదేవారు. భార్యలు సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. పరిస్థితులు మారాయి. భార్యలు భర్తలను కొట్టడం కూడా కామన్‌ అయింది. ఇపుపడు భర్తలు సర్దుకు పోతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక బాత్‌రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. విశ్వవ్యాప్తంగా భార్యల డామినేషన్‌ పెరుగుతోంది.

తన్నులు తింటున్న తెలంగాణ భర్తలు..
ఇదిలా ఉండగా, భార్యల చేతుల్లో భర్తలు చావుదెబ్బలు తింటున్న వారు క్రమంగా పెరుగుతున్నారు. ఇటీవల బయో సోషల్‌ స్టడీస్‌ రీసెర్చ్‌ సంస్థ భార్యల చేతుల్లో దెబ్బలు తినే భర్తలపై ఒక అధ్యయనం చేసింది. ఇందులో తెలంగాణ భర్తలే భార్యల చేతుల్లో ఎక్కువగా దెబ్బలు తింటున్నట్లు గుర్తించింది. ఇలా తన్నులు తినేవారిలో ఎక్కువగా తాగుబోతులు, నిరక్షరాస్యులు ఉన్నారు. దేశంలోని భర్తలపై జరుగుతున్న గృహ హింససై ఈ సంస్థ చేసిన అద్యయనాన్ని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రచురించింది.

15 ఏళ్లుగా పెరుగుతున్న దాడులు..
గత 15 ఏళ్లుగా భర్తలపై భార్యల దాడులు పెరుగుతున్నాయని అధ్యయనంలో గుర్తించారు. 15 ఏళ్లలో భర్తలపై దాడులు ఐదు రెట్లు పెరిగినట్లు అధ్యయనం తెలిపింది. ప్రతీ 1000 మంది మహిళల్లో 36 మంది భర్తలను చితకబాదుతున్నారని గుర్తించింది. 2006లో ఈ సంఖ్య ఏడు ఉండగా ఇప్పుడు 36కు పెరగడం గమనార్హం.

రక్షణ చట్టాలే కారణం..
ఇక మహిళలు పురుషులపై దాడులు చేయడానికి ప్రధాన కారణం మహిళలకు రక్షణ చట్టాలు ఉండడమేనని అధ్యయనం తేల్చింది. ఈ చట్టాలను అడ్డుపెట్టుకుని భార్యలు భర్తలపై డామినేషన్‌ చేయడానికి యత్నిస్తున్నారని తెలిపింది. మరో కారణం మద్యానికి బానిసైన భర్తలు భార్యలను వేధించడం. వేధించే భర్తలపై భార్యలు తిరగబడుతున్నట్లు గుర్తించారు.