Pawan Kalyan Janasena : జనసేన 10 ఏళ్ల ప్రస్థానం.. 2014లో ప్రారంభం.. నాడు అద్భుతమైన హైప్ వచ్చింది.. ఎంతో మంది ప్రజలు ఏపీలో మూడో ప్రత్యామ్మాయంగా పవన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సందర్భం.. జనసేన 10 ఏళ్లు అయిన సందర్భంగా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం..
ఇలా పరిణామాలు మారుతాయని ఎప్పుడూ ఊహించలేదు. స్వతంత్రులంతా మూడో ప్రత్యామ్మాయ శక్తి రావాలని పవన్ ను అభిమానించారు. ఎదగాలనుకున్నారు.
తాజాగా బొలిశెట్టి సత్యనారాయణ టీవీ9లో చర్చలో మాట్లాడిన మాటలు చూశాక జనసేనపై అభిప్రాయంలో తేడా వస్తోంది. పవన్ అభిమానులే ఆశ్చర్యపోతున్నారు..
బొలిశెట్టి సత్యనారాయణ లాంటి హేతుబద్దమైన వ్యక్తి మాటలు అద్భుతంగా ఉన్నాయి. 24 సీట్లు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రం కోసం మేం 24 సీట్లు ఒప్పుకున్నామన్నారు. చంద్రబాబును అందరికీ పెద్దదిక్కుగా పవన్,బొలిశెట్టి అభివర్ణించడం చూస్తుంటే ఇక మూడో ప్రత్యామ్మాయంగా ఎదగడం జనసేనకు కష్టం అని చెప్పకతప్పదు..
జనసేన 10 ఏళ్ళ ప్రస్థానం ఎలా వుంది? దీనిపై ‘రామ్’ గారి 10 ప్రశ్నలు జనసేనకు ఏంటో కింది వీడియోలో చూడొచ్చు.