
Tamil Nadu Hospital: పదేళ్లుగా ఓ సైకో.. దాదాపు 300 మంది రోగులను హత్య చేశాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు.. ఆ వీడియో ఇప్పుడు తమిళనాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బంధువులు, కుటుంబసభ్యుల సూచన మేరకే..
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో అటుతిరిగి ఇటు తిరిగి పోలీసులకు చేరింది. ఆ వీడియో ఆధారంగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాలు వెల్లడించారు. నామక్కల్ జిల్లా పల్లి పాలయానికి చెందిన మోహన్‌రాజ్ (34) స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిత్యం సంచరించేవాడు. శవాగారం వద్ద పని చేస్తున్న వ్యక్తితో కలిసి అతడు చెప్పే పనులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో 18వ తేదీన సామాజిక మాధ్యమాల్లో అతడు హత్యలు చేసినట్లు మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.
విషపు సూది ఇచ్చి..
వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబసభ్యులు, బంధువుల కోరిక మేరకు సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. దీనికి రూ. 5 వేలు తీసుకుంటున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఇలా దాదాపు 300 మందిని పదేళ్లలో హత్య చేసినట్టు మోహన్‌రాజ్ పేర్కొన్నాడు. చెన్నై, బెంగళూరులో కూడా ఈ తరహా పనులకు వెళ్లానని చెప్పాడు. రూ.5 వేలు ఇస్తే రెండు నిమిషాలలో పని పూర్తి చేస్తానని పేర్కొన్నాడు.

వీడియో ఆధారంగా విచారణ..
రోగుల హత్య విషయం మోహన్ రాజ్. మృతుల కుటుంబాలకు మినహా ఈ అరికీ తెలియదు. తాజాగా మోహన్ రాజ్ వీడియో వైరల్ కావడంతో పళ్లిపాలయం పోలీసులు కేసు నమోదు చేసి, మోహన్‌రాజ్‌ని అరెస్టు చేశారు. మద్యం మత్తులో తాను అలా మాట్లాడినట్లు అతను దర్యాప్తులో పేర్కొనడం గమనార్హం.
ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 18 మంది నకిలీ వైద్యులతోపాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తాగిన మైకంలో రూ.5 వేల కోసం 300 మంది రోగుల ప్రాణాలు తీయడం సంచలనంగా మారింది. రోగులకు సపర్యలు చేయలేనివారు తమ చేతికి మట్టి అంటకుండా అయిన వాళ్లనే వదిలించుకోవడం విషాదకరం.