Hyderabad: వివాహేతర సంబంధం మోజులో కొందరు మహిళ దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రియుడితో కలిసి కట్టుకున్నవారినే కడతేర్చుతున్నారు. ఆ తర్వాత హత్యను ప్రమాదంగా చిత్రీకరించి, తప్పించుకోవడానికి కథలు అల్లుతున్నారు. చివరికి అడ్డంగా దొరికిపోతున్నారు. ఇటీవల ఉమ్మడి నల్లొండ జిల్లాలో ప్రియురాలి కోసం సహచర విద్యార్థినే దారుణంగా చంపేశాడు. హత్య చేసిన తర్వాత ఆ ఫొటోలను ప్రియురాలికి వాట్సాప్ చేశాడు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రయుడితో భర్తను హత్య చేయించిన భార్య.. హత్య చేస్తున్న దృశ్యాలను వాట్సాప్ లైవ్‌లో చూస్తూ ఎంజాయ్ చేసింది. తర్వాత ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ విచారణలో దొరికిపోయారు.
భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.
కృష్ణా జిల్లా మట్టం గ్రామానికి చెందిన జయకృష్ణ(36), దుర్గా భవానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు హైదరాబాద్‌కు వలసవచ్చి, జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆల్విన్‌కాలనీ కమలాప్రసన్న నగర్‌లో నివాసం ఉంటున్నారు. జయకృష్ణ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుర్గా భవానీ కొన్నేళ్లుగా జయకృష్ణ స్నేహితుడు చిన్నాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తొలుత గుట్టుగా తమ సంబంధాన్ని కొనసాగించారు. ఏడాది క్రితం వీరి బాగోతం బయటపడింది. అప్పుడు భర్త ఇద్దరినీ మందలించాడు. అయినా సరే.. వాఇరిలో మార్పు రాలేదు. అతని ముందు నటిస్తూ.. వెనుక తమ రాసలీలలు కొనసాగించారు.
ప్రియుడికి దూరం కావొద్దని..
భార్య ప్రవర్తన సరిగా లేకపోవడం.. స్థానికంగా ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో జయకృష్ణ సొంత ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 10వ తేదీన ఇంటిని ఖాళీ చేసి, కుటుంబాన్ని తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. అయితే.. సొంతూరుకి వెళ్లిపోతే, తన ప్రియుడ్ని కలవలేనన్న ఉద్దేశంతో, భర్త అడ్డు తొలగించాలని దుర్గ భవాని పన్నాగం వేసింది. ప్రియుడు చిన్నాతో కలిసి పథకం రచించింది. ఇందులో భాగంగా దుర్గ ఊరికి వెళ్లింది. చిన్నా ఇక్కడ జయకృష్ణ ఇంటికి వెళ్లి, మద్యం తాగించాడు. మద్యం మత్తులో అతడు బెడ్రూంలో పడిపోగా.. చిన్నా అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అప్పుడు దుర్గకి వీడియో కాల్ చేయగా.. మంటల్లో కాలిపోతున్న భర్తని చూస్తూ ఆమె ఎంజాయ్ చేసింది.
పోలీసులకు చిక్కకుండా సలహా..
ప్రియుడిని కాపాడుకునేందుకు.. వీడియో కాల్‌లోనే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చిన్నాకి సలహాలు ఇచ్చింది. ఈ ఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించేలా ప్రియుడికి సూచనలు ఇచ్చింది. అనంతరం.. ఆర్థిక ఇబ్బందులతో తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని నమ్మించేందుకు నాటకం ఆడింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుర్గపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా.. వివాహేతర సంబంధం కోసమే ప్రియుడు చిన్నాతో కలిసి భర్తని చంపించినట్టు తెలిపింది.