Karnataka Cabinet: ఓడినా మంత్రి పదవి.. లక్కంటే మాజీ సీఎం శెట్టర్‌దేపో!

కాంగ్రెస్ పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డీకే.శివకుమార్‌ పోటీ పడ్డారు. అయితే అధిష్టానం 50:50 ఫార్ములా అమలు చేసింది.

Written By: Raj Shekar, Updated On : May 20, 2023 10:01 am

Karnataka Cabinet

Follow us on

Karnataka Cabinet: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరును కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఇన్ని రోజులు సీఎం పదవి కోసం పోటీ పడిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ చివరికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో పాటు సోనియా గాంధీ చర్చలతో ఇద్దరూ రాజీ అయ్యారు. మూడు కారణాలతో సీఎం రేసు నుంచి డీకే తప్పుకున్నారు. ఇక ఇప్పుడు మంత్రివర్గం ఎంపిక కసరత్తు మొదలైంది. ఓడిపోయిన మాజీ సీఎంకు మంత్రివర్గంలో చోటు దక్కడం మరో చర్చకు దారితీసింది.

50:50 ఫార్ములా..
కాంగ్రెస్ పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డీకే.శివకుమార్‌ పోటీ పడ్డారు. అయితే అధిష్టానం 50:50 ఫార్ములా అమలు చేసింది. మొదటి విడతలో సిద్దరామయ్య సీఎంగా, రెండో విడతలో డీకే.శివకుమార్ సీఎంగా ఉండటానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం సీటు కోసం ఇన్ని రోజులు పోటీ పడుతున్న ఇద్దరు నాయకులు రాజీ కావడంతో ఇప్పుడు అసలు కథ మొదలైంది.

ఇద్దరి వర్గాల్లో ఆశావహులు..
సీఎంగా సిద్దరామయ్య ఖరారు కావడంతో మంత్రివర్గం కూర్పు మొదలైంది. సిద్దరామయ్య వర్గంలో, డీకే శివకుమార్ వర్గంలో మంత్రి పదవులు ఆశిస్తున్నా నాయకులు చాలా మంది ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలతోపాటు ఊహించని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఇదే మయంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గంలోని ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆశిస్సుతో చాలా మంది మంత్రులు అయ్యే అవకాశం ఉంది.

ఓడిపోయినా పదవి దక్కింది..
మంత్రివర్గం జాబితాలో కర్ణాటక మాజీ సీఎం, ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్తో పోటీ చేసి ఓడిపోయిన జగదీష్ శెట్టర్ కూడా ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసి ఎమ్మెల్యే అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది కూడా మంత్రివర్గం లిస్ట్‌లో ఉన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు హరిప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మనియప్ప మంత్రి పదవులు కోసం ఆశపడుతున్నారని వెలుగు చూసింది.

కర్ణాటకలో కాబోయే మంత్రులు వీరే..

సిద్దరామయ్య వర్గం నుంచి..

– కేజే జార్జ్
– బసవరాజ రాయరెడ్డి
– దినేష్ గుండురావ్
– ఎంబీ. పాటిల్
– జమీర్ అహమ్మద్ ఖాన్
– తుకారామ్
– రహీమ్ ఖాన్
– రాఘవేంద్ర హిట్నాల్
– శివలింగేగడ
– ఎస్ఎస్ మల్లికార్జున్
– ఈశ్వర్ ఖండ్రే
– టీబీ జయచంద్ర
– అజయ్ సింగ్
– కృష్ణభైరే గౌడ
– సతీష్ జారకిహోళి
– డాక్టర్ హెచ్‌సీ.మహదేవప్ప
– వినయ్ కులకర్ణి
– యూటీ ఖాదర్

డీకే.శివకుమార్ వర్గం నుంచి..

– లక్ష్మీ హెబ్బాళ్కర్
– ఎస్. రవి
– తన్వీర్ సేఠ్
– మధు బంగారప్ప తదితరులు

కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన నాయకలు..
– డాక్టర్ జీ పరమేశ్వర్
– బీకే హరిప్రసాద్
– రామలింగా రెడ్డి
– జగదీష్ శెట్టర్ (ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రి పదవి వస్తోంది)
– లక్ష్మణ సవది
– ప్రియాంక ఖార్గే
– కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప