https://oktelugu.com/

Viral Pic: పెళ్లి జరుగుతుంటే కూడా ఇవేం పనులు..? కాసేపు ఆగలేకపోయావా? వరుడు చేసిన పని వైరల్

కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు కావాలని క్రియేట్ చేస్తే మరికొందరు మాత్రం అనుకోకుండా వైరల్ అవుతుంటారు. వైరల్ అవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు కొందరు. కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని నార్మల్ రిజల్ట్ ను అందిస్తాయి. ఇంకొందరికి మాత్రం మంచి హిట్ సినిమా అందించిన కిక్ ను ఇస్తుంది. అయితే ఇప్పుడు ఒక టాపిక్ చెప్పుకుందాం. అందులోని వరుడు కావాలని చేశాడా? నిజంగా అతనికి ఆ పని వ్యసనమా? అనే విషయం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 2, 2024 / 09:40 PM IST

    Viral Pic

    Follow us on

    Viral Pic: ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక గొప్ప సంఘటన పెళ్లి. ఈ రోజు కోసం ఎందరో వెయిట్ చేస్తారు. ఎన్నో లక్షల రూపాయలు కూడా ఖర్చు చేస్తుంటారు. చిరకాలం గుర్తుండి పోయేలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు చాలా మంది. తమ స్థాయికి తగ్గట్టు పెళ్లి తంతులో ప్రతిదీ ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. ఎన్నో విషయాలు శ్రద్ధతో ఏర్పాట్లు చేస్తుంటారు. అలాగే పెళ్లిళ్లలో సరదా పనులు చేసే వారు చాలా మంది ఉంటారండోయ్. పెళ్లికి వచ్చిన బంధుజనం సాధారణంగా చిలిపి పనులు చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తారు. ఆటపట్టిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయంలో మాత్రం చిలిపి, అల్లరి పనులు మొత్తం చేసింది ఆ పెళ్లి కొడుకే.

    మరికాసేపట్లో పెళ్లి. బంధువుల హడావుడి, పిల్లల సందడితో పెళ్లి మండపం మొత్తం కలకలలాడుతుంది. కాసేపట్లో మంగళ ధారణ జరిగే సమయానికి మండపంలో పీటలపై కూర్చున్న పెళ్లి కొడుకు మాత్రం వేరే పనిలో ఎవరు ఊహించని రేంజ్ లో బిజీ అయ్యాడు. తన ముందున్న పురోహితుడు వేద మంత్రాలు చదువుతున్నాడు. కానీ మండపం వెనుక ఇతగాడు మాత్రం వేరే పనిలో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.

    ఏంటి ఇది మాకు ఇంతకీ ఆ పెళ్లి కొడుకు చేసిన పని ఏంటి అనుకుంటున్నారా? పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకు మండపంపైనే వెనుకకు తిరిగి ఫోన్ ఆన్ చేసి సరదాగా ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నాడు. మండపం వెనుక ఉన్న తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఫోన్‌లో లూడో గేమ్‌ ఆడుతున్నాడు. తన పెళ్లి తంతును కూడా మర్చిపోయినట్టు ఉన్నాడు ఈ సూపర్ స్మార్ట్. ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది. ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఇది తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.

    దేనికి ప్రియారిటీ ఇవ్వాలో బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడే అంటూ ఫన్నీగా సమాధానం ఇస్తున్నారు. బ్రో వదిన రేపు ఇదే పాయంట్ తో నన్ను పట్టించుకున్నావా అని వాయిస్తుంది జాగ్రత్త అంటూ సరదాగా రిప్లే ఇస్తున్నారు. ఇలా వరుడు ఊహించని రీతిలో వినోదంలో మునిగిపోవడం చూసిన నెటిజన్లు తమదైన రేంజ్ లో స్పందిస్తూ నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. ఈ ఫోటోలు మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పెళ్లి వేడుకల్లో ఇలాంటి ఫన్నీ మూమెంట్లు వైరల్ గా మారడం కామన్ గా చూస్తుంటాం.