Girls Google Search Trend: పెళ్లంటే అబ్బయిలు చాలా సంతోషంగా ఉంటారు. కానీ అమ్మాయిలు మాత్రం బిడియంగా కనిపిస్తారు. దాదాపు 20 ఏళ్ల పాటు తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఉన్న వారు ఇప్పుడు కొత్త లోకంలోకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. కొత్త మనుషులు, కొత్త వాతావరణంలో ఎలా ఉండాలో తెలియక ఇబ్బందులు పడుతామోనని ముందే భయపడిపోతుంటారు. గతంలో ఇలాంటి భయాలు ప్రతి ఒక్క అమ్మాయిలో ఉండేది. కానీ నేటి కాలంలో పెళ్లి గురించి యువతులు ముందే తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా అబ్బాయి గురించి, వారి వాతావరణం గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే పెళ్లికి సిద్ధమవుతున్నారు. అయితే ఎన్ని తెలుసుకున్నా.. చాలా మందికి పెళ్లయిన తరువాత ఎలా ఉండాలోనన్నది సందేహంగానే మిగిలి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పర్సనల్ విషయాలను ఎవరిని అడగాలో తెలియక తికమకపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి గూగుల్ మంచి స్నేహితుడిగా మారింది. దీంతో చాలా మంది యువతులు పెళ్లి చేసుకునే సమయంలో తమకున్న డౌట్లను గూగుల్ ద్వారా సెర్చి చేస్తున్నారట.
నేటి కాలంలో అమ్మాయిలు పెళ్లంటే పెద్దగా భయపడిపోవాల్సిన అవసరం లేదు.. అన్నట్లు గా మారిపోయారు. చదువుకునే రోజుల్లోనే భవిష్యత్ లో ఎలా ఉండాల ముందే డిసైడ్ అవుతున్నారు. ఇక చాలా మంది యువతులు కొన్నాళ్ల పాటు జాబ్ చేసిన తరువాతే పెళ్లి చేసుకుంటామని అంటున్నారు. ఈ క్రమంలో వారు తోటి స్నేహితులు, ఇతరుల అనుభవాలను తెలుసుకుంటున్నారు. ఆ తరువాత భవిష్యత్ లో ఎలా ఉండాలో ముందే గ్రాప్ గీసుకుంటున్నారు. ఇలా కొన్ని డౌట్స్ ఇతరులను అడగలేనివి గూగుల్ ద్వారా సెర్చ్ చేస్తున్నారు.
మనలో ఉండే ప్రతీ డౌట్ ను గూగుల్ ద్వారా తీర్చుకోవచ్చు. కొన్ని పర్సనల్ విషయాలు కూడా గూగుల్ తల్లి చెబుతుందంటే ఎవరూ నమ్మరు. అయితే పెళ్లి చేసుకునే సమయంలో అమ్మాయిలు సంసారం ఎలా చేయాలి? అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారట. ముఖ్యంగా పెళ్లి సమయంలో ఎలాంటి దుస్తులు కొనుగోలు చేయాలి? ఆ తరువాత ఎలాంటి డ్రెస్ ధరించాలి? పెళ్లయిన అమ్మాయి ఇతరులతో ఎలా మాట్లాడుతుంది? అత్తగారితో ఎలా ఉండాలి? అత్తగారు మనల్ని చీటికి మాటికి వేధిస్తే ఏం చేయాలి? ఏ విషయాలు అమ్మానాన్నలతో షేర్ చేసుకోవాలి? భర్తతో ఏ విషయాలు చెప్పాలి? అనే విషయాలు బాగా సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి విషయాలు ఒకప్పుడు ముసలివాళ్లు పెళ్లయే అమ్మాయిలకు కూర్చోబెట్టి చెప్పేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో చాలా మంది యువతులు గూగుల్ తల్లిన నమ్ముకొని తమ సందేహాలను తీర్చుకుంటున్నారు. ఒక కొంత మంది యువతులు అయితే భర్తతో ఎలా ఉండాలి? ఆయనతో ఏ విషయాలు చెప్పాలి? అనే విషయాలు ప్రత్యేకంగా సెర్చ్ చేస్తున్నారు. మొన్నటి వరకు చాలా మంది యువతులు ఇలాంటి విషయాలు తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్నారు. ఆ తరువాత సినిమాలను చూసి తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.