Puri Jagannadh Charmy : పూరి జగన్నాథ్ సంసార జీవితంపై సోషల్ మీడియాలో ఎన్నో గుసగుసలున్నాయి.ఆయన చార్మితో కలిసి సినిమా నిర్మాణ రంగంలో పాలుపంచుకోవడం.. చార్మి పెళ్లి చేసుకోకుండా పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మారడంపై బోలెడన్నీ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకానొక సమయంలో పూరి తన భార్యకు విడాకులు ఇచ్చి చార్మిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు ప్రచారమయ్యాయి. వీరిద్దరి చనువుతో చాలా మంది చాలా రాశారు. ఇద్దరూ కలిసి ప్రొడక్షన్ హౌస్ నడపడం.. పలు పార్టీలకు అటెండ్ కావడంతో ఈ ప్రచారం సాగింది.
సినీ ఇండస్ట్రీలో ఇలాంటి గుసగుసలు బోలెడన్నీ వస్తుంటాయి. వీటిపై ఇప్పటివరకూ అటు పూరి కానీ.. ఇటు చార్మి కానీ అధికారికంగా స్పందించలేదు. తాజాగా పూరి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చార్మితో కొనసాగుతారని రాస్తున్నారు.
ఈ వార్తలపై తాజాగా పూరి జగన్నాథ్ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో ఆకాష్ పూరి స్పందించారు. తన పేరెంట్స్ విడాకుల విషయమై తొలిసారి స్పందించారు. ‘అమ్మానాన్నల మధ్య గొడవలు, విడాకుల విషయాలు తనకైతే తెలియదని చెప్పిన ఆకాష్ పూరి.. వాళ్ల మధ్యన అసలు ఎలాంటి మనస్పర్ధలు లేవని’ స్పష్టం చేశారు. విడాకులు అని ప్రచారం చేస్తున్న వారికి అదో టైం పాస్ అంటూ పూరి తనయుడు అసలు నిజాన్ని క్లారిటీ ఇచ్చాడు.
అమ్మానాన్న ప్రేమ వివాహం చేసుకున్నారని.. వాళ్లది ప్యూర్ లవ్ అని ఆకాష్ పూరి తెలిపారు. నాన్న జేబులో రూ.200 రూపాయలు మాత్రమే ఉన్న సమయంలో ఆయన అడగ్గానే మరో మాటకు తావులేకుండా పెళ్లి చేసుకుందని.. నాన్న ఒడిదొడుకుల్లో అమ్మ ఎప్పుడూ వెన్నంటే ఉందని ఆకాష్ పూరి తెలిపారు.
అమ్మ ఎప్పుడూ వీక్ పర్సన్ కాదని.. డాడీకి ఫ్యామిలీ టెన్షన్ లేకుండా చేస్తుందని.. తనను, తన చెల్లిని బాగా చూసుకొని పెంచిందని ఆకాష్ పూరి తెలిపారు. ఒకానొక సమయంలో నాన్న కారు, ఇల్లు అన్నీ కోల్పోయి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నా మాకు ఏవీ తెలియకుండా అమ్మ జాగ్రత్త పడిందని ఆకాష్ తెలిపారు.