
Ashu Reddy: సోషల్ మీడియా సెన్సేషన్ అషురెడ్డి ఓ నెటిజన్ కి బిగ్ బాస్ షాక్ ఇచ్చింది. అతను చేసిన కామెంట్ నచ్చకపోవడంతో చెప్పు చూపించింది. ఇదిప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అషురెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఇంస్టాగ్రామ్ లో ఆమె తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తుంటారు. సాంప్రదాయవాదులు నొచ్చుకునేలా అషురెడ్డి తీరు ఉంటుంది. ఈ క్రమంలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. అషురెడ్డి ఫోటోల కామెంట్ సెక్షన్స్ బూతులతో నిండిపోతుంటాయి. సదరు విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. బూతు నా బట్టలో లేదు. మీ కళ్ళలోనే కామం ఉందన్న అర్థంలో అషురెడ్డి ఒక వీడియో పోస్ట్ చేశారు.
Also Read: NTR 30: ఎన్టీఆర్ 30పై ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్!
తాజాగా అషురెడ్డి అభిమానులతో ఆన్లైన్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఆమెకు కోపం తెప్పించే కామెంట్ చేశాడు. ”ఈ మధ్య నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. అది నీకు అర్థం కావడం లేదా?” అని సెటైర్ వేశాడు. నెటిజన్ సెటైర్ కి స్పందించిన అషురెడ్డి ”అవును ఈ మధ్య కొంచెం తక్కువైంది” అని కాలి చెప్పు ఎమోజీ పోస్ట్ చేసింది. అషురెడ్డి చర్యకు సోషల్ మీడియా జనాలు షాక్ తిన్నారు. చెప్పుతో కొడతా అన్నట్లున్న ఆమె సమాధానానికి ఆశ్చర్యపోయారు.
ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదు, తిరిగి ఇచ్చేపడేస్తా అన్నట్లు అషురెడ్డి తయారయ్యారు. నిజానికి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు అషురెడ్డి పట్టించుకోదు. ఆమె పాపులారిటీ, ఫేమ్ కోసం ఏదైనా చేస్తుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన బూతు ఇంటర్వ్యూలు అందుకు నిదర్శనం. వర్మ ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తుంటే ఆమె మురిసిపోవడం ఊహించని పరిణామం. ఆ ఇంటర్వ్యూల విషయంలో అషురెడ్డి దారుణమైన ట్రోల్స్ కి గురయ్యారు. ఆమె కోరుకున్న ఫేమ్ అయితే వచ్చింది.

సోషల్ మీడియా వీడియోలతో ఫేమస్ అయిన అషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3 పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నారు. హౌస్లో కూడా మితిమీరిన స్కిన్ షో చేసింది. కేవలం గ్లామర్ తో నెట్టుకు రావడం కుదరదని ప్రేక్షకులు తేల్చిపారేశారు. త్వరగా హౌస్ నుండి బయటకు పంపారు. ఆ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్-శ్రీముఖి ఫైనల్ కి వెళ్లారు. రాహుల్ విన్నర్ గా టైటిల్ అందుకున్నాడు. రాహుల్ సిప్లిగంజ్-అషురెడ్డి మధ్య ఎఫైర్ ఉండనే పుకార్లు ఉన్నాయి. మరోవైపు నటిగా బిజీ కావాలని చూస్తుంది. ఆమెకు వెండితెర ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.
Also Read:‘Amigos’ collections : ‘అమిగోస్’ 3 రోజుల వసూళ్లు.. వచ్చిన నష్టాలు ఎంతో తెలుసా?