
KCR Assembly: జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తెలంగణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కాంగ్రెస్‌కు స్నేహ హస్తం అందిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు కీలక నేతలెవరూ ముందుకు రావడం లేదు. పదవులు, ఆర్థిక ప్రయోజనాలు ఆశ చూపినా నేతలు గులాబీ గూటికి రావడం లేదు. ఇప్పటి వరకు చేరిన వారంతా ఔట్ డేటెడ్ నేతలే. దీంతో తొందరగానే తత్వం బోదపడినట్లుంది. ఒంటరిగా వెళ్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్న భావన కేసీఆర్‌కు ఏర్పడినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలో ఎదో ఒక పార్టీ సహకారం లేకుండా జాతీయ రాజకీయాల్లో రాణించలేమని గులాబీ బాస్ గుర్తించారు. తనకు బద్ధ శత్రువైన బీజేపీని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ కాంగ్రెస్‌వైపు చూస్తున్నారని తెలుస్తోంది.
Also Read: KCR BRS: తెలంగాణలో రాచరికం.. అదే బీఆర్‌ఎస్‌కు ముప్పు!
అందుకే ఆ ప్రశంసలు..
బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. యూపీఏ హయాంలో మన్మోహన్‌సింగ్ చాలా బాగా పరిపాలించారని.. ఆయన హయాంలో దేశం ఆర్థికంగా వృద్ధి సాధించిందని చెప్పుకొచ్చారు. 14 శాతం అప్పులను తగ్గించారని అన్నారు. మోదీ హయాంలో వృద్ధి పడిపోవడమే కాదు 54 శాతం అప్పులు పెంచారని మండిపడ్డారు. మన్మోహన్‌సింగ్ బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసిందని, మోదీ∙కంటే మన్మోహన్‌సింగ్ ఎక్కువ పనిచేశారుని వివరించారు. కాంగ్రెస్ బాగా పనిచేయలేదని 2014లో మోదీకి ఓటేస్తే పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందన్నారు. మన్మోహన్ కంటే మోదీ పాలనలో దేశం ఎక్కువ నష్టపోయిందని విరుచుకుపడ్డారు.
మోదీపై నిప్పులు..
అసెంబ్లీలో కాంగ్రెస్, వ] న్మోహన్‌పై ప్రశంసలు కురిపించిన కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్‌లో మోదీ ప్రసంగంపైనా విమర్శలు గుప్పించారు. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేందని ప్రశ్నించారు. నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే నువ్వెన్ని అంటూ మోదీ, రాహుల్ గొడవపడుతున్నారన్నారు. హిండెన్ బర్గ్ నివేదికపై మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దేశానికి ఒక లక్ష్యం అంటూ లేకుండా పోయిందన్నారు. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ ర్యాంక్ తక్కువ ఉందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అని విమర్శించారు. మనదేశం 3.3 ట్రిలయన్ డాలర్ల దగ్గరే ఆగిపోయిందని తెలిపారు. మొత్తం 192 దేశాల్లో మనదేశం ర్యాంక్ 139 ర్యాంక్ అని తేల్చారు. మేకిన్ ఇండియా జోకింగ్ ఇండియా అయ్యిందని… తన మాటకు కట్టుబడి ఉంటా అని చెప్పుకొచ్చారు. తాను చెప్పినదాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. దేశ ఆర్థిక మంత్రి వచ్చి కామారెడ్డిలో రేషన్ డీలర్‌తో మోదీ ఫొటో కోసం కొట్లాడిందనిం ఏం సాధించాడని మోదీ ఫొటో పెట్టాలని ప్రశ్నించారు. 2024 తర్వాత బీజేపీ ఖతం అవుతుందని జోష్యం చెప్పారు.

స్నేహ ‘హస్తం’ ఇచ్చేనా?
జాతీయ రాజకీయాల కోసం కాంగ్రెస్‌తో దోస్తీకి ప్రయత్నిస్తున్నట్లు అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం ద్వారా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నువ్వా నేనా అన్నట్లు ఫైట్ చేస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ బీఆర్‌ఎస్‌తో దోస్తీ ఉండదని ఇదివరకే ప్రకటించారు. రాహుల్‌గాంధీతో కూడా వరంగల్ సభలో చెప్పించారు. ఈ పరిస్థితిలో తన రాజకీయ భవిష్యత్ కోసం కేసీఆర్ అందించే స్నేహహస్తానికి కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది కీలకంగా మారింది. ఇప్పటికే 9 ఏళ్లుల అధికారినిక దూరంగా ఉన్న కాంగ్రెస్ 2024లో ఎలాగైనా గెలవాలనుకుంటోంది. ఈ పరిస్థితిలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకోవాలని చూస్తోంది. మరి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయా అంటే కాలమే సమాధానం చెప్పాలి.
Also Read: Uttarandhra TDP: ఉత్తరాంధ్రలో టీడీపీని గాడిలోపెట్టే పనిలో చంద్రబాబు.. ఆ నేతలకు సీరియస్ వార్నింగ్