Ashleigh Gardner : మగాళ్లు మగాళ్ళను ప్రేమించడం.. ఆడవాళ్లు ఆడవాళ్లను ప్రేమించడం.. కొంతకాలం సహజీవనం చేయడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఒకప్పుడు ఈ సంస్కృతి అంతగా ఉండేది కాదు. కాకపోతే మనదేశంలో మాదిరిగా కాకుండా ఇతర దేశాల్లో చట్టాలు రక్షణ కల్పిస్తుండడంతో.. మగవాళ్ళు మగవాళ్ళను.. ఆడవాళ్లను ఆడవారు ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విషయంలో దూకుడు మీద ఉన్నారు. క్రీడారంగంలో ఉన్నవారు ఎక్కువగా ఇలాంటి వివాహాలు చేసుకుంటున్నారు.. ఆ మధ్య ఒక లేడీ క్రికెటర్ కూడా.. తను సహజీవనం చేస్తున్న ప్రియురాలితో పెళ్లి చేసుకుంది. తన పాటించే మతం ఆధారంగా పెళ్లి చేసుకొని.. అందరినీ ఆశ్చర్యంలో ముంచింది.
Also Read : పడుకుని లేచి వచ్చి.. తొలి ఓవర్ లో రెండు వికెట్లు..
ప్రియురాలిని పెళ్లి చేసుకుంది..
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో యాష్లి గార్డ్ నర్(Ashleigh Gardner) అనే ఓ క్రికెటర్ ఉంది. ఆస్ట్రేలియా జట్టు సాధించిన విజయాలలో ఈమె కీలక పాత్ర పోషించింది.. బౌలింగ్, బ్యాటింగ్ కూడా చేయగల నేర్పరితనం ఈమె సొంతం. సామాజిక మాధ్యమాలలో కూడా చాలా చురుకుగా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది.. అందానికి అందం.. ఎత్తుకు ఎత్తు ఉండడంతో ఏమను చాలామంది ఆరాధించేవారు. అభిమానించేవారు. ఈమె ఆడుతున్న మ్యాచ్ లు చూసేందుకు వెళ్లి ఫ్ల కార్డులతో తమ ప్రేమను వ్యక్తం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్లందరికీ షాక్ ఇస్తూ యాష్లి గార్డ్ నర్(Ashleigh Gardner) ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది.. సుదీర్ఘకాలం తను సహజీవనం చేస్తున్న మౌనిక రైట్ అనే యువతిని యాష్లి గార్డ్ నర్(Ashleigh Gardner) వివాహం చేసుకుంది. 2021 నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. గత ఏడాది ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఆదివారం అత్యంత సన్నిహితుల మధ్య ఉంగరాలు మార్చుకొని.. దంపతులయ్యారు. ఈ విషయాన్ని యాష్లి గార్డ్ నర్(Ashleigh Gardner) సోషల్ మీడియాలో పంచుకుంది.. “Mrs and Mrs Gardner” అంటూ తమ వివాహానికి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది. అయితే ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో యాష్లి గార్డ్ నర్(Ashleigh Gardner) గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించింది. యాష్లి గార్డ్ నర్(Ashleigh Gardner) ఆధ్వర్యంలో గుజరాత్ జట్టు 2023లో ఐదవ స్థానం.. 2024లోనూ 5వ స్థానం.. 2025లో మాత్రం మూడో స్థానంలో నిలిచింది. యాష్లి గార్డ్ నర్(Ashleigh Gardner) వయసు ప్రస్తుతం 27 సంవత్సరాలు. అయితే హఠాత్తుగా తన ప్రియురాలిని పెళ్లి చేసుకుని యాష్లి గార్డ్ నర్(Ashleigh Gardner) అందరికీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయడంతో నెటిజన్లు
యాష్లి గార్డ్ నర్(Ashleigh Gardner), మోనికా రైట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జీవితాన్ని హాయిగా, ఆనందంగా ఆస్వాదించాలని సూచిస్తున్నారు.
Also Read : హీ టీంలు కావాలి..ఆడవాళ్ల నుంచి మగాళ్లను కాపాడండి ప్లీజ్.. మగాళ్ల ధర్నా వైరల్