PBKS Vs RR: పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) బౌలింగ్ ఎంచుకోవడంతో.. రాజస్థాన్ రాయల్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (yashasvi Jaiswal) (67), సంజు శాంసన్ (Sanju Samson)(38), కెప్టెన్ రియాన్ పరాగ్ (Rajasthan royals captain Riyan paraag) (43) దుమ్ము రేపే రేంజ్ లో ఆడటంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేసింది.. పంజాబ్ బౌలర్ పెర్గూ సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, అర్ష్ దీప్ సింగ్ చెరొక వికెట్ సాధించారు. అనంతరం 206 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన పంజాబ్ జట్టుకు ప్రారంభంలోనే కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది.
Also Read: అనుకున్నదే జరిగింది.. చెన్నై హ్యాట్రిక్.. ఢిల్లీ టాప్..
రెండు వికెట్లు సాధించాడు
రాజస్థాన్ జట్టు విధించిన 206 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన పంజాబ్ జట్టుకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. పంజాబ్ బ్యాటర్లు ఏమాత్రం కోలుకోకుండా చేశాడు రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (jofra Archer). అతడు వేసిన తొలి బంతికే ప్రమాదకరమైన ప్రియాన్ష్ ఆర్యను అవుట్ చేశాడు. అద్భుతమైన ఇన్ స్వింగర్ వేసి ప్రియాన్ష్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక్కసారిగా మ్యాచ్ పై పట్టు బిగించింది. ఇదే సమయంలో పంజాబ్ జట్టు వరుసగా ఎదురు దెబ్బలు తగిలించుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ సమయంలో ఆర్చర్ డ్రెస్సింగ్ రూమ్ లో వెచ్చగా దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు. ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి వచ్చి తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీసి.. రాజస్థాన్ రాయల్స్ జట్టును లీడ్ లోకి తీసుకొచ్చాడు. ఇక ఈ కథనం రాసే సమయానికి పంజాబ్ జట్టు 9 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. నేహల్ వదేరా(22), మాక్స్ వెల్(9) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ప్రియాన్ష్ ఆర్య (0), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (17), శ్రేయస్ అయ్యర్ (10), లివింగ్ స్టోన్ (1) పెవిలియన్ చేరుకున్నారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ కుమార్ కార్తికేయ, లివింగ్ స్టోన్ సందీప్ శర్మ బౌలింగ్లో ఔట్ అయ్యారు. ప్రస్తుతం పంజాబ్ జట్టు తీవ్రమైన కష్టాల్లో ఉంది. ఆ జట్టు గెలవాలంటే అద్భుతమే జరగాలి..ఈ కథనం రాసే సమయానికి 9 ఓవర్లు పూర్తయిపోయాయి.