
చంటి అడ్డాల 90వ దశకంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆయన పలు తెలుగు, తమిళ సినిమాలకు పనిచేసేవారు. ఒకే సమయంలో మూడు నాలుగు సినిమాలు చేసేవారు. ఈ క్రమంలోనే రామానాయుడు సినిమాతో పాటు మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ సినిమాకు ఆర్డ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు..
ఇక గ్యాంగ్ లీడర్ సినిమా ఆర్ట్ డైరెక్టర్ అయిన చంటి అడ్డాల షూటింగ్ కు రాకుండా తను ముఖ్యమైన సందర్భాల్లో వచ్చి మిగతా సమయాల్లో తన శిష్యులతో ఆ సినిమాను చూసుకోమనే వారు. గ్యాంగ్ లీడర్ సినిమాకు విజయ్ బాపినీడు దర్శక, నిర్మాతగా వ్యవహరించేవారు.
మద్రాసు టు హైదరాబాద్ షూటింగ్ ల కోసం చంటి అడ్డాల అప్ అండ్ డౌన్ చేసేవారు. ఈ క్రమంలోనే గ్యాంగ్ లీడర్ లో పలు సీన్లు మారడం.. కథ మార్చడంతో ఆర్ట్ డైరెక్టర్ అవసరం పడింది. దీంతో వెంటనే చంటిని పిలిపించారట.. ఆయన మద్రాసు నుంచి సెట్ వేసి గంటలో వెళ్లేందుకు రెడీ కాగా గ్యాంగ్ లీడర్ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయట.. ఆర్ట్ డైరెక్టర్ చంటి లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు అని యూనిట్ అంతా ఆగ్రహించింది. ఈ క్రమంలోనే చంటి స్పాట్ లో ఉండాలని యూనిట్ స్కెచ్ గీశారట..
గ్యాంగ్ లీడర్ సినిమా రైటర్ బాబూ రావు ఈ మేరకు ఒక ప్లాన్ చేశాడట.. ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాలకు ఒక చిన్న వేషం వేసి ఇరికిద్దామని స్కెచ్ గీశారట.. చంటిని గ్యాంగ్ లీడర్ లో ఒక కీలక పాత్ర ఇచ్చారట.. బలవంతంగా ఒప్పించి వేయించారట.. తనకు నాయుడు గారి షూటింగ్ ఉందని.. చేయలేనని..అన్నా బలవంతంగా చిన్న వేషం అంటూ మేకప్ వేసి నటింపచేశారట..
ఈ క్రమంలోనే ఒక్కరోజు అన్నది 24 రోజులు పట్టిందట.. చిరంజీవికి విలన్ బ్యాచ్ లో కీలక పాత్రధారిగా చంటిని చేసేసరికి 24 రోజులు యూనిట్ తోపాటు బుక్కయ్యాడట.. క్లైమాక్స్ లో చిరంజీవి ఇదే చంటిని కింద పడేసి కాలితో తొక్కే సీన్ కు అందరూ ఎంకరేజ్ చేశారట.. షూటింగ్ కు రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతావా? అని చిరంజీవి కామెడీ సరదాకు చంటిని కాలితో తొక్కే సీన్ కు అందరూ ఈలలు గోలలు చేశారట.. అయ్యో సార్.. నేను షూటింగ్ కు వస్తానన్న చిరంజీవి నిజంగానే తొక్కేశారట.. ఆ సీన్ నాకు మధురమైన జ్ఞాపకం అని చంటి తాజాగా పంచుకున్నారు. నన్ను అలా గ్యాంగ్ లీడర్ లో బుక్ చేశారని చెప్పుకొచ్చారు.