Skin Care Tips: వేసవిలో చర్మం ఎక్కువగా ట్యాన్‌కి గురవుతుంది. చెమట, వేడి వల్ల చర్మం నల్లగా మారడం, నల్లటి మచ్చలు వంటివి వస్తాయి. వీటివల్ల ముఖంలో అసలు కాంతివంతం ఉండదు. ముఖం డల్‌గా ఉంటుంది. సమ్మర్‌లో ముఖం కాంతివంతంగా ఉండాలని చాలా మంది బ్యూటీ క్రీమ్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఇవి ఆ నిమిషానికి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ ఆ తర్వాత చర్మ సమస్యలను తీసుకొస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు, నల్లగా అయిపోవడం ఇలాంటివి వస్తాయి. అయితే వేసవిలో చర్మ సమస్యలు రాకుండా ముఖం కాంతివంతంగా మెరవాలంటే మాత్రం కేవలం ప్రొడక్ట్స్ వాడితే సరిపోదు. ఆహార విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖ్యంగా వేసవిలో తాజా జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే పదార్థాలతో జ్యూస్‌లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: లేవగానే మొబైల్ పడుతున్నారా? ముందు ఈ పనులు చేయండి
క్యారెట్
క్యారెట్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను తగ్గించి సహజంగా చర్మం మెరిసేలా చేస్తుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
బీట్‌రూట్
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మం మెరిసేలా చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ జ్యూస్ వల్ల నల్లగా ఉన్నవారు కూడా తెల్లగా మారుతారు. ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయి.
అల్లం
అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పోషకాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై వాపు, మొటిమలు, ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. మీరు తయారు చేసే జ్యూస్‌లో కాస్త అల్లం వేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
నిమ్మకాయ
ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులోని కొల్లాజెన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అలాగే ముఖంపై ఉండే మొటిమలను కూడా తగ్గిస్తుంది.
యాపిల్
వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. మీరు వీటిన్నింటిని కలిపి జ్యూస్ తయారు చేసకుంటే స్కిన్ మెరిసిపోతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చర్మం మెరుగుపడుతుంది. చర్మమంతా కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయి. డైలీ ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల స్కిన్ మెరుస్తుందని నిపుణులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.
Also Read: లైఫ్‌లో హ్యాపీనెస్ ఉండాలంటే.. ఈ చిన్న మార్పులు చేయండిలా!