Allu Arha: శాకుంతలం చిత్రానికి ఉన్న స్పెషల్ అట్రాక్షన్ అల్లు అర్హ. అందులో ఎలాంటి సందేహం లేదు. భారీ ఫ్యాన్ బేస్ కలిగిన అల్లు అర్జున్ కూతురు నటిస్తున్న మొదటి చిత్రం అనగానే కొంచెం హైప్ వచ్చిపడింది. అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్స్ శాకుంతలం సినిమా చూడాలి అనుకుంటారు. తమ అభిమాన హీరో వారసురాలు సిల్వర్ స్క్రీన్ పై ఎలా కనిపిస్తుంది? ఆమె నటన ఎలా ఉంటుంది? అనే ఆసక్తి నెలకొని ఉంది. అందులోనూ పౌరాణిక చిత్రం కావడంతో జనాల్లో ఆమె నటనను చూడాలని ఆత్రుతగా ఉంది. అల్లు అర్హ ప్రస్తుత వయసు ఆరేళ్ళు. ఇంత చిన్న ప్రాయంలో ఒక ఛాలెంజింగ్ రోల్ ఆమె చేయాల్సి వచ్చింది.

ఇక శాకుంతలం మూవీ కథ పురాణాలపై కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. విశ్వామిత్రుడు, మేనకల కుమార్తె అయిన శకుంతలను దుష్యంతుడు ప్రేమిస్తాడు. దుష్యంతుడు-శాకుంతలం దుర్వాస మహర్షి శాపానికి గురవుతారు. ఆ శాపం శకుంతలను కష్టాలపాలు చేస్తుంది. ఇటీవల శాకుంతలం ట్రైలర్ విడుదల చేశారు. దర్శకుడు గుణశేఖర్ విజువల్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. శకుంతల పాత్రకు సమంత చక్కగా సరిపోయారు.
కాగా ట్రైలర్ లో అల్లు అర్హను కూడా పరిచయం చేశారు. ట్రైలర్ చివర్లో శకుంతల కొడుకు భరతుడిగా సింహంపై అర్హ వచ్చారు. ట్రైలర్లో అర్హను పరిచయం చేసిన తీరు సీక్వెల్ ని గుర్తు చేసింది. పురాణాల్లో శకుంతల కుమారుడు భరతుడు కూడా వీరుడే. ఆయన పాండవులు, కౌరవుల పూర్వీకుడు. ఆయన పేరు మీదే భారతం, భరత ఖండం అనే పేర్లు ఉద్భవించాయి అంటారు.

మొదటి నుండి అల్లు అర్హ ప్రిన్స్ భరత రోల్ చేస్తున్నారు యూనిట్ చెప్తున్నారు. ఈ రోజుల్లో జనాలకు భరతుడు గురించి కూడా పెద్దగా అవగాహన లేదు. దీంతో ట్రైలర్ లో అర్హను అబ్బాయిగా చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అర్హ అబ్బాయి పాత్ర చేస్తున్నారా? అని సరికొత్త అనుభూతిని పొందారు. పెద్దగా క్వాలిటీ లేని గ్రాఫిక్స్ కావడంతో సింహం మీద అర్హ అంతగా ఆకట్టుకోలేదు. సహజత్వానికి దగ్గరగా ఉంటే ఆ ఎంట్రీ మెప్పించేది. అందుకే అర్హను పరిచయం చేసిన తీరు చాలా మందికి నచ్చలేదు. ఇక అర్హ అసలు కొంచెం కూడా యాక్టింగ్ చేయలేదని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అర్హపై నెగిటివ్ కామెంట్స్ చేయడం అనవసరం. తన వయసు, అనుభవం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే జస్ట్ ట్రైలర్ చూసి అంచనా వేయడం కరెక్ట్ కాదు.